Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిస్టర్ పెద్దిరెడ్డి.. మీ సీఎం అసమర్థుడా? చేతకానివాడా? వైకాపా ఎంపీ ప్రశ్న

Advertiesment
Raghurama KrishnaRaju
, శుక్రవారం, 12 మార్చి 2021 (06:51 IST)
ఏపీలోని అధికార వైకాపాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదే పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు సూటిగా ఓ ప్రశ్న సంధించారు. నేను గనుక సీఎం అయితేవుంటే టీడీపీలో చంద్రబాబు మినహా ఇంకెవ్వరూ మిగిలివుండరంటూ ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. అసలు ఈ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
మీ సీఎం అసమర్థుడా? చేతకాని వాడా? సమాధానం చెప్పు. చంద్రబాబుకు నేను బంట్రోతుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. రాజకీయంగా నాకు చంద్రబాబు ఉన్నత స్థానం ఇచ్చారు. చంద్రబాబును విమర్శించే స్థాయి నీకు లేదన్నారు. 
 
నా గెలుపునకు వైఎస్ విజయమ్మ, షర్మిల, జగన్ ఫొటోలు ఉంటే నా వ్యక్తిగత ఇమేజ్ కూడా తోడైంది. నేను సీఎం జగన్‌ను ఎప్పుడూ విమర్శించలేదు. ప్రభుత్వ పాలసీలను, విధానాలను, తప్పుచేస్తున్న వారిని మాత్రమే విమర్శించానని, ఇకపై కూడా విమర్శిస్తానని తెలిపారు. 
 
అదేసమయంలో తనకు మంత్రి పెద్దిరెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు చెప్పారు. దానికంటే ముందు తాను ఒక సవాల్ విసురుతున్నానన్నారు. తాను రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే జగన్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్లీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని సూచించారు. అప్పుడు పెద్దిరెడ్డి సవాల్‌కు తాను సిద్ధమని తెలిపారు.
 
పైగా, గత ఎన్నికల్లో 'నా కాళ్లు పట్టుకొని బతిమాలితే నేను జగన్‌ పార్టీలో చేరాను. జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డిల దయవల్ల నువ్వు మంత్రి అయ్యావ్. ఇసుక ద్వారా ఎన్నివేల కోట్లు సంపాదిస్తున్నావో ప్రజలకు తెలుసు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో గడ్డకడుతున్న రక్తం!