Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు, పవన్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డి పరార్, డిజిపి ఆగ్రహం

Advertiesment
varra ravinder reddy

ఐవీఆర్

, బుధవారం, 6 నవంబరు 2024 (17:47 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితలతో పాటు అనేక మందిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైకాపా సోషల్ మీడియా కార్యకర్త, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఐతే అతడికి 41-ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టేసారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిఐజి ద్వారకా తిరుమల రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. అతడిని మరో కేసుపై అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు అతడు తప్పించుకుని పారిపోయాడు. దీనితో అతడి కుటుంబ సభ్యులను ఆచూకి కోసం విచారిస్తున్నారు.
 
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా మరింతగా రెచ్చిపోయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టారు. రాష్ట్రంలో అధికారి మార్పిడి చోటుచేసుకున్న తర్వాత కూడా తన వైఖరిని మార్చుకోకుండా అసభ్యకర పోస్టులు పెడుతూనే ఉన్నాడు. దీంతో పోలీసులు కడప జిల్లా పులివెందులలో అదుపులోకి తీసుకున్నారు. ఐతే అతడిని రహస్య ప్రదేశంలో విచారించి 41-ఎ నోటీసు ఇచ్చి వదిలేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
కాగా, గత వైకాపా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, అనిత, వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, వైఎస్ విజయమ్మ ఇలా ప్రతి ఒక్కరినీ విమర్శించారు. పైగా, జగనన్న ఆదేశిస్తే దేనికైనా సిద్ధమే అన్న విధంగా పోస్టులు పెట్టారు. 'అవసరమైతే సునీతను కూడా లేపేయండి' అన్న అంటూ రాయలేని భాషలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. 
 
చివరకు జగన్ తల్లి విజయమ్మపైనా అసభ్యకర పోస్టులకు వెనకాడలేదు. రవీందర్ రెడ్డి పోస్టులపై మనస్థాపానికి గురైన వివేకా కుమార్తె సునీత, సైబరాబాద్​లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. షర్మిల కూడా హైదరాబాద్​లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరుదైన రికార్డును నెలకొల్పిన డోనాల్డ్ ట్రంప్.. ఏంటది?