Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-11-2024 శనివారం రాశిఫలాలు - వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు...

Advertiesment
Astrology

రామన్

, శనివారం, 2 నవంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు త్వరితగతిన సాగుతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. పత్రాల్లో మార్పులు సాధ్యమవుతాయి. వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఉత్సాహంగా అడుగులేయండి. పనులు వేగవంతమవుతాయి. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులకు చేరువవుతారు. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు కొనసాగించండి. అనుమానాలకు తావివ్వవద్దు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. ప్రయాణంలో అవస్థలు తప్పవు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో సతమతమవుతారు.. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. పొగడ్తలకు పొంగిపోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆహ్వానం అందుకుంటారు. అనవసర జోక్యం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. పరిచయస్తులతో సంభాషిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఆశయం సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి మేలు జరుగుతుంది. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. బాధ్యతలు అప్పగించవద్దు. అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమర్థతను చాటుకుంటారు.. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వ్యాపకాలు అధికమవుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బంధుమిత్రులతో విభేదిస్తారు. పట్టింపులకు పోవద్దు. సామరస్యంగా మెలగండి. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. దైవకార్యంలో పాల్గొంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. కష్టసమయంలో ఆప్తులు ఆదుకుంటారు. ఆందోళన కలిగించి సమస్య సద్దుమణుగుతుంది. నోటీసులు అందుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం, పనుల్లో శ్రమ ఒత్తిడి అధికం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దిపావళి ఆస్థానం