Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-01-2025 బుధవారం దినఫలితాలు : గృహం సందడిగా ఉంటుంది...

Advertiesment
horoscope

రామన్

, బుధవారం, 1 జనవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పనులు ఒక పట్టాన సాగవు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
దుబారా ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పందాలు, పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభవార్త వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి. కానుకలు అందుకుంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రముఖులకు కానుకలు అందజేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. పందాలు, పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ధనప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. పాత పరిచయస్తుల కలయిక అనుభూతినిస్తుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. పనులు అర్థాంతంగా ముగిస్తారు. అసాంఘిక కార్యకాలాపాలకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఉల్లాసంగా కాలం గడపుతారు. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విందులు, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. పనులు ఒక పట్టాన సాగవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. పనులు హడావుడిగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. కానుకలు, అభినందనలు అందుకుంటారు. సంతానం అత్యుత్సాహాన్నిఅదుపు చేయండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. కొత్త పనులు చేపడతారు. కీలక పత్రాలు అందుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. దైవదర్శనంలో ఒకింత అవస్థలు ఎదుర్కుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంఘంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. పరిచయాలు బలపడతాయి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు, వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులతో తీరిక ఉండదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళ, క్రీడా పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

31-12-2024 మంగళవారం రాశిఫలాలు : రుణ సమస్యలు తొలగిపోతాయి..