Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-08-2026 నాటి రాశి ఫలితాలు... ఈ రోజు అనుకూలదాయకమే

Advertiesment
Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రోజువారీ ఖర్చులే ఉంటాయి, కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహమార్పు కలిసివస్తుంది. వేడుకను ఘనంగా చేస్తారు. విలువైన జాగ్రత్త పనులు త్వరితగతిన సాగుతాయి. వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. నిజానికి లోనవుతారు. ఆశావాహదృక్పథంతో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రియతములతో సంభాషిస్తారు. పత్రాలు అందుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అవకాశాలు చేజారిపోతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమించినా ఫలితం ఉండదు. మీ ఇష్టం మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. వ్యవహారాల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ రోజు అనుకూలదాయకమే. మాట నిలబెట్టుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. నగదు, ఆధరణాలు జాగ్రత్త. దూరపు బంధువులను కలుసుకుంటారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వివాహ యత్నం ఫలిస్తుంది. కొత్త బంధుత్వాలేర్పడతాయి. నిశ్చితార్ధంలో మెలకువ వహించండి. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాలతో తీరిక ఉండదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. సన్నిహితులకు కలుసుకుంటారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సృష్టించుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సమయస్ఫూర్తితో మెలుగుతారు. ధనలాభం ఉంది. దుబారా ఖర్చులు విపరీతం, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకకు హాజరవుతారు. పసులు అర్థాంతంగా ముగిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధృఢసంకల్పంతో శ్రమించండి. విమర్శలు పట్టించుకోవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. పొదుపు మూలక ధనం గ్రహిస్తారు. పనులు ముందుకు సాగవు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ చిత్తశుద్ధికి ప్రశంసలందుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కీలక పదవి చేపడతారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారి అమెరికా ప్రవచనం ముఖ్యాంశం