Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-09-2025 శుక్రవారం ఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు.. మీ కష్టం వృధా కాదు...

Advertiesment
simharashi-5

రామన్

, శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సన్నిహితుల వ్యాఖ్యలు మీ పై సత్ప్రభావం చూపుతాయి. చికాకుపరిచే సంఘటన ఎదురవుతుంది. దంపతుల మధ్య స్వల్ప కలహం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధా కాదు. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయం తీసుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారపరిజ్ఞానంతో రాణిస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆప్తులతో గృహం సందడిగా ఉంటుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాల్లో మెళకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ రోజు అనుకూలదాయకం. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. బాకీలు వసూలవుతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. ధనప్రాప్తి ఉంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పెట్టుబడులకు తరుణం కాదు. పెద్దల సలహా పాటించండి. కీలక పత్రాలు అందుకుంటారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. పనులు సాగక విసుగు చెందుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పిల్లల విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆధ్యాత్మికతపై దృష్టిపెడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. దంపతుల మధ్య సఖ్యత లోపం. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. పొదుపు ధనం అందుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. దైవదర్శనాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. పెద్దల సలహా పాటిస్తారు. ధనలాభం ఉంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సమయస్థూరితతో మెలుగుతారు. పొదుపు ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పం సిద్ధిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పనులు హడావుడిగా సాగుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రియతములతో కాలక్షేపం చేస్తారు. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pitru Paksha: ఆ మూడు రుణాల్లో పితృరుణం తీర్చుకోవాల్సిందే.. మహాలయ పక్షం ప్రారంభం ఎప్పుడు?