Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-06-2026 సోమవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

Advertiesment
mesham
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి అధికం. పత్రాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునేర్పులకు పరీక్షా సమయం. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో రాణిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సర్వత్రా అనుకూలం. రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. అయిన వారి కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సన్నిహితులతో సంభాషిస్తారు. దైవ కార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. స్వయంకృషితోనే రాణిస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం శూన్యం. ఆలోచలతో సతమతమవుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. అనునయంగా మెలగండి. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్ధతను చాటుకుంటారు. అందరిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. వాయిదా పడిన పనులు ఆకస్మికంగా పూర్తిచేస్తారు. మీ చొరవతో ఒక సమస్య సానుకూలం అవుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం సాయం తగదు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉల్లాసంగా గడుపుతారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు సంతృప్తికరం. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. పనులు, కార్యక్రమాలు సాగవు. చిన్న విషయానికే ఉద్రేకపడతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. పనులు సాగవు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. గత సంఘటనలు మరిచిపోవద్దు. ఖర్చులు విపరీతం. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-06-22 ఆదివారం ఫలితాలు - సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది