Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-05-2025 మంగళవారం దినఫలితాలు - అవకాశాలను చేజార్చుకోవద్దు...

Advertiesment
Weekly astrology

రామన్

, మంగళవారం, 13 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రుణ విముక్తులవుతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. కొత్తయత్నాలు మొదలు పెడతారు. అవకాశాలను వదులుకోవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. సంతానం కృషి ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్త వింటారు. మీ కష్టం వృధాకాదు. చిన్ననాటి పరిచయస్తులకు కలుసుకుంటారు. ఖర్చులు విపరీతం. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. పనులు అప్పగించవద్దు. శుభకార్యానికి హాజరవుతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. 
 
సింహం : పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అతిగా ఆలోచింపవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఖర్చులు అధికం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. చిన్న విషయానికే చికాకుపడతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచించవద్దు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఖర్చులు సామాన్యం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. వ్యతిరేకులు చేరువవుతారు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ప్రయాణం తలపెడతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఒత్తిళ్లకు గురికావద్దు. చాకచక్యంగా వ్యవహరించండి. ఓర్పు, పట్టుదలతోనే కార్యం సిద్ధిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. చేపట్టిన పనులు సాగవు. పెద్దల హితవు మీపై చక్కగా పనిచేస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ధార్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పనులు వేగవంతమవుతాయి.. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. యత్నాలను కుటుంబీకులు ప్రోత్సహిస్తారు. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-05-2025 సోమవారం దినఫలితాలు - రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...