Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-10- 2024 ఆదివారం దినఫలితాలు : మీ శ్రీమతి సలహా పాటిస్తారు...

Advertiesment
astro2

రామన్

, ఆదివారం, 13 అక్టోబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యం నెరవేరుతుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. సన్నిహితులలను కలుసుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. వివాహయత్నం ఫలిస్తుంది.. పెద్దలను సంప్రదిస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు స్వీకరిస్తారు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. బంధువులతో సంభాషిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనవసర జోక్యం తగదు. సంతానం దూకుడు కట్టడిచేయండి. ప్రయాణం వాయిదా వేసుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త పనులు చేపడతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు పురస్కారాలు అందుకుంటారు. పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. వాయిదాల చెల్లింపులను అశ్రద్ధ చేయకండి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొత్తవారితో మితంగా సంభాషించండి. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఖర్చులు సామాన్యం. నిరుద్యోగుల యత్నం ఫలిస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొన్ని విషయాలు మీరు ఊహించినట్టే జరుగుతాయి. ఖర్చులు సామాన్యం. నోటీసులు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పాత పరిచయసులను కలుసుకుంటారు. వివాదాలు కొలిక్కివస్తాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.. వివాహయత్నం ఫలిస్తుంది. అవతలి వారి స్థితిగతులు క్షుణ్ణంగా తెలుసుకోండి. సంతానం దుడుకుతనం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఊహించని ఖర్చులెదురవుతాయి. రుణాలు, చేబదుళ్లు సీకరిస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. లావాదేవీల్లో అయిన వారి సలహా పాటించండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ధైర్యంగా అడుగు ముందుకేయండి. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త సమస్యలెదురవుతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దంపతుల మధ్య అకారణ కలహం. సన్నిహితులతో సంభాషిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి కష్టకాలం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చేస్తున్న పనులు ఆపివేయవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అప్రమత్తంగా ఉండాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. సంప్రదింపులతో సతమతమవుతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-10-2004 నుంచి 19-10-2024 వరకు మీ వార ఫలితాలు