Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-08-2025 గురువారం మీ రాశి ఫలితాలు - శ్రమ అధికం, ఫలితం శూన్యం

Advertiesment
Astrology

రామన్

, గురువారం, 14 ఆగస్టు 2025 (05:05 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయానికీ కుంగిపోవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. మొక్కుబడిగా పనులు పూర్తిచేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. దైవదర్శనాలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆచితూచి అడుగేయండి. తొందరపాటు నిర్ణయం తగదు. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రముఖులకు చేరువవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
భేషజాలకు పోవద్దు. మీ తప్పును సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలు పట్ల ఆకర్షితులవుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. నగదు, వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి అధికం. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. వేడుకకు హాజరవుతారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెద్దఖర్చు ఎదురవుతుంది. చేసిన పనులే చేయవలసి వస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం కృషి ఫలిస్తుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమయస్ఫూర్తిగా మెలగండి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఏకపక్ష నిర్ణయం తగదు. పెద్దల సలహా తీసుకోండి. సంప్రదింపులు వాయిదా పడతాయి. రావలసిన ధనం అందదు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేస్తున్న పనులు అర్ధాంతంగా ముగిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రుణసమస్య పరిష్కారమవుతుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. శుభకార్యానికి హాజరవుతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శ్రమ అధికం, ఫలితం శూన్యం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పట్టించుకోవద్దు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. పత్రాలు అందుకుంటారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పంతాలకు పోవద్దు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. రాజీమార్గంలోనే సమస్యలు పరిష్కారమవుతాయి. పనులు ఒక పట్టాన సాగవు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ ఓర్పునకు పరీక్షా సమయం. అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలతో సతమతమవుతారు. పనుల్లో ఆటంకాలెదురవుతాయి. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ఆప్తులు సాయం అందిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వాహనం ఇతరులకివ్వవద్దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vishnu Sahasranama: నక్షత్రాల ఆధారంగా విష్ణు సహస్రనామ పఠనం చేస్తే?