Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-07-2024 ఆదివారం దినఫలాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు...

Advertiesment
astro1

రామన్

, సోమవారం, 15 జులై 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ శు॥ నవమి ప.3.50 స్వాతి రా.10.09 తె.వ.4.10 ల 5.53. ప.దు.12.29 ల 1. 21 పు.దు. 3. 05 ల3.57.
 
మేషం :- ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. స్వర్ణకారులు, బులియిన్ వ్యాపారులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. మీ యత్నాలకు మీ శ్రీమతి ప్రోత్సాహం లభిస్తుంది. కష్టకాలంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు.
 
వృషభం :- శస్త్రచికిత్సల సమయంలో వైద్యరంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభ్యంతరావు ఎదుర్కోవలసి వస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు.
 
మిథునం :- ఒక స్థిరాస్తి సమకూర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
కర్కాటకం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. నూతన పరిచయాలు, వ్యాపకాలు ఏర్పడతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. సోదరీ సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడితప్పదు.
 
సింహం :- భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయబేధాలు భిన్నంగా ఉంటాయి. మిమ్మల్ని పొగిడే వారేకానీ సహకరించే వారుండరు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది, మెళుకువ వహించండి. క్యాటరింగ్, స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకంగా ఉంటుంది.
 
కన్య :- ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది. బ్యాకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.
 
తుల :- ఉద్యోగస్తులకు ఆకస్మిక అభిప్రాయభేదాలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ఆకాలభోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి.
 
వృశ్చికం :- ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్పురిస్తుంది. మిత్రులను కలయికతో ప్రశాంతతను పొందుతారు. ఆస్తి పంపకాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులకు వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం.
 
ధనస్సు :- ఉద్యోగస్తులు స్థానమార్పిడికి చేయుయత్నాలలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. సహచరుల సలహావల్ల నిరుద్యోగులు సదవకాశాలు జారవిడుచుకుంటారు. చేనేత, ఖాదీ, నూలు, కలంకారీ వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు.
 
మకరం :- దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. విద్యార్థులకు ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు పుట్టింటివారి మీద ధ్యాస మళ్ళుతుంది. కంప్యూటర్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ రంగాల్లో వారికి అభివృద్ధి కానవస్తుంది.
 
కుంభం :- చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా అయినా పూర్తి కాగలవు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. మీ సంతానం పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.
 
మీనం :- బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు సంతృప్తినిస్తాయి. సంతానంతో అభిప్రాయబేధాలు వస్తాయి. బ్యాంకు పనులు చురుకుగా సాగుతాయయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14-07-2024 ఆదివారం రాశిఫలాలు - నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు...