మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ఖర్చులు విపరీతం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పిల్లల దూకుడు అదుపు చేయండి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఖర్చులు అధిరం. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సన్నిహితులతో సంభాషిస్తారు. పదవుల నుంచి తప్పుకోవలసి వస్తుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. కొత్త యత్నాలు మొదలెడతారు. ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పుతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్సిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. సన్నిహితుల కలయిక ఉత్సాహపరుస్తుంది. మీ జోక్యం అనివార్యం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సమయస్ఫూర్తితో మెలుగుతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు వేగవంతమవుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఉల్లాసంగా గడుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. వేడుకకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలను అధిగమిస్తారు. మీ శ్రమ వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. నగదు స్వీకరణలో జాగ్రత్త. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వాయిదా పడుతున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లౌక్యంగా వ్యవహరిస్తారు. కార్యం సిద్ధిస్తుంది. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. బంధువులతో సత్సబంధాలు నెలకొంటాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. అనవసర జోక్యం తగదు. దంపతుల మధ్య ఏకాగ్రత నెలకొంటుంది.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పట్టుదలతో యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. పెద్దల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. చేపట్టిన పనులు సాగవు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వేడుకకు హాజరవుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. పొగిడేవారితో జాగ్రత్త. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.