Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-09-2025 సోమవారం దినఫలితాలు : మానసిక ప్రశాంతత పొందుతారు...

Advertiesment
daily horoscope

రామన్

, సోమవారం, 29 సెప్టెంబరు 2025 (05:01 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాలి. సంప్రదింపులు వాయిదా పడతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. పెద్ద ఖర్చు ఎదురవుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. ప్రకటనలను నమ్మవద్దు. వేడుకకు హాజరుకాలేరు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనంతో మెలగండి. వాగ్వాదాలకు దిగవద్దు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పనులు, కార్యక్రమాలు సాగవు
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. సంప్రదింపులతో తీరిక ఉండదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఫోన్ సందేశాలను నమ్మవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. పదవుల స్వీకరణకు అనుకూలం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్ని విధాలా బాగుంటుంది. వ్యవహారపరిజ్ఞానంతో రాణిస్తారు. మీ కష్టం వృధాకాదు. మీ జోక్యం అనివార్యం. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. దుబారా ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్తయత్నాలు చేపడతారు. అపరిచితులతో జాగ్రత్త. ఆహ్వనం అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు సామాన్యం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీదైన రంగంలో రాణిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పనులు వాయిదా వేసుకుంటారు. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సంబంధం కలిసివస్తుంది. నిశ్చితార్థాల్లో మెలకువ
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. వ్యవహారానుకూలత ఉంది. ధనలాభం ఉంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు సానుకూలమవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో సతమతమవుతారు. ఖర్చులు సామాన్యం. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూరప్రయాణం తలపెడతారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకున్న కార్యం నెరవేరుతుంది. మానసికంగా కుదుటపడతారు. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. దూరపు బంధుత్వాలు బలపడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-09-2025 ఆదివారం దినఫలితాలు : మానసిక ప్రశాంతత పొందుతారు...