Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-09-2026 నుంచి 27-09-2026 వరకు మీ వార ఫలితాలు

Advertiesment
weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ అంచనాలు ఫలిస్తాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. శనివారం నాడు పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. తరచు బంధుమిత్రులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానానికి శుభపరిణామాలున్నాయి. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. మీ గౌరవప్రతిష్టలకు భంగం కలుగకుండా మెలగండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ఉద్యోగ విధుల్లో అలక్ష్యం తగదు. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. విందుకు హాజరవుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ కలుపుగోలు తనం ఆకట్టుకుంటుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బుధవారం నాడు కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ కష్టం ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, వ్యాపారాల్లో లాభనష్టాలు పరిశీలించుకుంటారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. సన్నిహితులు వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. గురువారం నాడు చేసిన పనులు మొదటికే వస్తాయి. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువుల కోసం శ్రమిస్తారు. స్థిరాస్తి వ్యవహారంలో ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక వార్త ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అర్ధాంతంగా ముగిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త యత్నాలు చేపడతారు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. గృహనిర్మాణం ముగింపు దశకు వస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం అన్ని విధాలా అనుకూలదాయకం. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. కొత్తయత్నాలు మొదలెడతారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. సంతానానికి దూరప్రాంతంలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు అధికం. పొదుపుధనం ముందుగా గ్రహిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. క్రమం తప్పకుండా ఔషధ సేవనం పాటించండి. వ్యాపారాలు నిదానంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. విందుకు హాజరవుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్ధికలావాదేవీలు కొలిక్కివస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. రావలసిన ధనంలో కొంతమొత్తం అందుతుంది. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్ధిరాస్తి, వాహనం కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఒంటెద్దు పోకడ తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ విధుల్లో అలక్ష్యం తగదు. అధికారులకు బాధ్యతల మార్పు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. పరిస్థితులు క్రమంగా మెరుగుపతాయి. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కష్టం వృధాకాదు. స్నేహసంబంధాలు మరింత బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. అనుకున్న ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేయగల్గుతారు. సోమవారం నాడు వివాదాస్పద విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. స్థిరచరాస్తులపై దృష్టి సారిస్తారు. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధననకు ఓర్పు, పట్టుదల ముఖ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలకు ఎదో విధంగా ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం ఉన్నత చదువుల కోసం శ్రమిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగ విధుల పట్ల అలక్ష్యం తగదు. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలతో సతమతమవుతారు. విశ్రాంతిలోపం, అకాల భోజనం. ఒప్పందాల్లో అనాలోచిత నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఏకపక్ష్యంగా వ్యవహరించవద్దు. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మొండి బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆప్తులతో తరచు సంభాషిస్తారు. శుక్రవారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. కీలక బాధ్యతలు చేపడతారు. విందుల్లో అత్యుత్సాహం తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. ఆడంబరాలకు వ్యయం చేస్తారు. ఆదివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. వివాదాస్పద విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ప్రైవేట్ ఉద్యోగులకు మార్పులు అనుకూలిస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. శుక్రవారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వారున్నారని గమనించండి. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. సంస్ధల స్థావనలకు అనుమతులు మంజూరవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సోమవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కీలక వివరాలు వెల్లడించవద్దు. సంతానానికి దూరప్రాంతంలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. అధికారులకు హోదా మార్పు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-09-2020 ఆదివారం నాటి రాశి ఫలాలు - ధన వ్యవహారాల్లో ఇతరులపై పూర్తిగా ఆధారపడకండి