Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Advertiesment
Weekly Horoscope

రామన్

, శనివారం, 10 మే 2025 (16:57 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. నిస్తేజానికి గురవుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు అందోళన కలిగిస్తారు. రుణాలు, చేబదుళ్లు తప్పవు. శనివారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులతో తరచుగా సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన బదిలీ. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారపరిజ్ఞానంతో రాణిస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. సోమవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. గృహమరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూల సమయం. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సంకల్పం సిద్ధిస్తుంది. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. యత్నాలకు పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి పొందుతారు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాదోపవాదాలకు దిగవద్దు. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి. చిత్తశుద్ధితో మీరు చేసిన ఉపకారానికి ప్రశంసలందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాల రెన్యువల్‌ను అలక్ష్యం చేయకండి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. ఆందోళన కలిగించిన సమస్య నిదానంగా సద్దుమణుగుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గురు, శుక్రవారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. సంతానం చదువులపై దృష్టిపెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు హోదా మార్పు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. శుభకార్యానికి హాజరవుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ కార్యాయాల్లో పనులు సానుకూలమవుతాయి. పొదుపు మూలక ధనం అందుతుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఆటంకాలు ఎదురైనా యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గృహవాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిసారిస్తారు. ఆపత్సమయంలో ఆప్తులు ఆదుకుంటారు. లావాదేవీలతో తీరిక ఉండదు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సోమవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. గృహమార్పు అనివార్యం. ఆహ్వానం అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఒక నష్టాన్ని మరో విధంగా భర్తీ చేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభసమయం ఆసన్నమైంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. యత్నాలు కార్యరూపం దాల్చుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. ఆదాయం బాగుంటుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. మంగళవారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ అభిప్రాయాలను సన్నిహితుల ద్వారా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి. అధికారులకు కొత్త సమస్యలు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులను సంతోషపరుస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి. సమర్థతను చాటుకుంటారు. అందరిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆదివారం నాడు దుబారా విపరీతం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. సంతానం దూకుడుకు అడ్డుకట్ట వేయండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుట్టండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యంతగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. నూతన పెట్టుబడులకు తగిన సమయం. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం బాగుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్నేహసంబంధాలు వెల్లివిరుస్తాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. ప్రకటనలు, దళారులను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. ఆప్తులతో తరుచుగా సంభాషిస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన బదిలీ. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధి పథకం చేపడతారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేష ఫలితాలున్నాయి. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలొ మెళకువ వహించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. న్యాయనిపుణుల సలహా పాటించండి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. విదేశాల్లోని సంతానంతో తరచుగా సంభాషిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తికాగలవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. వాయిదాలు చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. శుక్రవారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అపరిచితులు మోసగించే ఆస్కారం ఉంది. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్తులకు ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ పెట్టండి. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ