దంత సంరక్షణకు పురాతన ఔషధం కలబంద
కాలిన గాయాలు, గాట్లు తదితర నొప్పులను కలబంధ మొక్కలోని ఔషధగుణాలు సమర్ధవంతంగా నివారించగలవని ఎప్పుడో 10వ శతాబ్దంలోనే నిరూపించారు. గ్రంధస్తం చేశారు. దంత సంరక్షణలోనూ దీని పాత్ర ఎన్నదగినదని తాజా పరిశోధనల్లో
Publish Date: Wed, 22 Mar 2017 (20:32 IST)
Updated Date: Thu, 23 Mar 2017 (02:13 IST)
కాలిన గాయాలు, గాట్లు తదితర నొప్పులను కలబంధ మొక్కలోని ఔషధగుణాలు సమర్ధవంతంగా నివారించగలవని ఎప్పుడో 10వ శతాబ్దంలోనే నిరూపించారు. గ్రంధస్తం చేశారు. దంత సంరక్షణలోనూ దీని పాత్ర ఎన్నదగినదని తాజా పరిశోధనల్లో తేలడంతో కలబంధకు ప్రాచుర్యాన్ని మరింతగా పెంచుతున్నాయి. చర్మ సంరక్షణిగా దీనికెలాంటి స్థానం ఉందో అదేవిధంగా దంత సంరక్షణకు ఉపయోగించే జెల్‌లు, పేస్ట్‌లు వగైరాలలో దీన్ని దంతక్షయ నివారిణిగా ఉపయోగిస్తున్నారని తాజా అద్యయనం ఒకటి వెల్లడించింది.
సాధారణ టూత్‌పేస్ట్ ఏ రకమైన ఫలితాలనిస్తుందో అదే విధమైన ఫలితాలను కలబంధ జెల్ కూడా ఇస్తుందని అధ్యయనం వెల్లడిస్తోంది. నోటిలో దంతక్షయానికి కారణమయ్యే బాక్టీరియాను నిర్మూలించడంలో కలబంధ జెల్ నిర్వహించే పాత్ర చాలా ప్రశంశనీయమైనదని అధ్యయనం పేర్కొంది. దంతక్షయ నివారణలో కలబంధ జెల్ నిర్వహించే పాత్ర ప్రస్తుతం దంత వైద్యనిపుణుల పరిశోధనలు సాగుతున్నాయి. సాధారణ వాణిజ్య టూత్‌పేస్ట్‌లు రెండు కనబరిచే సామర్థ్యం కన్నా కలబంధ జెల్ రెండింతలు ఎక్కువగా సత్ఫలితాలనిస్తోందని ఈ అధ్యయనం తెలియజేస్తోంది.
కొన్ని సందర్భాల్లో కలబంధ జెల్ పనితీరే చాలా ఎక్కువగా ఉందని తేలింది. పిప్పిపళ్లకు, దంతక్షయానికి కారణమైన బాక్టీరియా నిర్మూలనలో దీని జెల్‌దే పైచేయిగా అధ్యయనం తేల్చింది. దీని వలన మరో ఉపయోగం కూడా ఉంది. కొన్ని రకాల టూత్‌పేస్ట్‌లు అందరికీ సరిపడవు. ముఖ్యంగా సున్నితమైన దంతాలున్న వారికి ఈ సమస్య ఎదురవుతుంటుంది. ఇలాంటి వారికి కలబంధ జెల్ మేలైనదని అధ్యయనం వివరించింది. టూత్‌పేస్ట్‌లతో సంతృప్తి పడని వారికి కలబంధ చాలా చక్కని ప్రత్యామ్నాయమని అధ్యయనం వెల్లడిస్తోంది.
అలాగని అన్ని రకాల కలబంధ జెల్‌లు ఒకే ఫలితమిస్తాయని అపోహ పడవద్దని అధ్యయనం హెచ్చరిస్తోంది. కలబంధతో తయారైన అన్నిటిలోను దీని పరిమాణం ఒకే రీతిలో, ఒకే స్థాయిలో ఉండకపోవడమే దీనికి కారణం. కలబంధ మొక్క కాండం మధ్య భాగాన ఉండే పదార్థాన్ని ఉపయోగించిన జెల్‌లోనే దీని సామర్థ్యం పెరుగుతుందని చెబుతున్నారు. ఈ సామర్థ్యం నిలకడగా ఉండటానికి తయారీదారులు కూడా కొన్ని ప్రమాణాలను పాటించాలనేది అధ్యయనవాదుల అభిప్రాయం.
Raju
Publish Date: Wed, 22 Mar 2017 (20:32 IST)
Updated Date: Thu, 23 Mar 2017 (02:13 IST)