Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘నేనే గెలిచాను’ - ప్రకటించుకున్న డోనల్డ్ ట్రంప్.. మోదీ, నెతన్యాహు అభినందనలు

Advertiesment
modi - trump

బిబిసి

, బుధవారం, 6 నవంబరు 2024 (15:02 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ తాను విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. కీలకమైన పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినా సహా వివిధ రాష్ట్రాలలో ట్రంప్ ముందంజలో నిలిచారు. తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ తాను విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. అమెరికాకు ఇది ‘గోల్డెన్ ఏజ్’ అని ఆయన అన్నారు. అధికారికంగా ట్రంప్ గెలిచినట్లు ఇంకా ప్రకటన వెలువడనప్పటికీ ఫలితాల సరళి ఆధారంగా ప్రపంచ దేశాల నేతలు కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. భారత ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఆయనకు అభినందనలు తెలిపారు.
 
మోదీ ఏమన్నారంటే..
డోనల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ''మిత్రుడు డోనల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు. మునుపటి మీ పాలన తరహాలో, మీ సహకారంతో భారత్ - అమెరికా సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం కోసం ఎదురుచూస్తున్నా. ఇరుదేశాల ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దాం'' అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
 
''చారిత్రాత్మక పునరాగమనానికి శుభాకాంక్షలు. మీరు వైట్‌హౌస్‌కి తిరిగిరావడం అమెరికాకు నూతన అధ్యాయం, ఇజ్రాయెల్ - అమెరికా కూటమిని మరింత శక్తివంతం చేస్తుంది'' అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. డోనల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని స్టార్మర్ అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ విజయం సాధించబోతున్నారని ఫాక్స్ న్యూస్ అంచనాలు విడుదల చేయడంతో ట్రంప్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన మద్దతుదారులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
 
అమెరికా అంతటా రిపబ్లికన్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఫ్లోరిడాలో మద్దతుదారుల ఆనందోత్సాహాల నడుమ ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. భార్య మెలానియా ట్రంప్, సహచరుడు జేడీ వాన్స్‌తో పాటు ప్రచార సిబ్బందితో సహా వేదికపైకి వచ్చారు. అందరూ వేదికపైకి వచ్చిన తర్వాత ఆయన ప్రసంగం ప్రారంభించారు. రాజకీయ విజయంగా ఆయన దీనిని అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడిగా తనకు మరో అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ''అమెరికా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మేం దేశ పునర్నిర్మాణానికి కృషి చేస్తాం'' అని ట్రంప్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుంది : డోనాల్డ్ ట్రంప్ విజయోత్సవ స్పీచ్