సౌందర్య చిట్కాలు.. ఉప్పు, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే?
ఒక స్పూన్ ఉప్పులో చెంచా రోజ్ వాటర్ కలిపి, అది కరిగిన వెంటనే ముఖానికి రాసుకోవాలి. మునివేళ్ళతో మెల్లిగా రెండు నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మంపై గల మృతకణాలు తగ్గిపోతాయి.
Publish Date: Wed, 09 May 2018 (15:47 IST)
Updated Date: Wed, 09 May 2018 (15:51 IST)
సరైన పద్దతులలో, సరైన సౌందర్య చిట్కాలను పాటించడం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. సౌందర్య చిట్కాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. సహజమైన సౌందర్య చిట్కాలను వాడటం వలన మీ ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ చిట్కాలేంటో చూద్దాం.
అర చెంచా ముల్తానీ మట్టిలో అరచెంచా పాలపొడి, గులాబీ రేకుల మిశ్రమం, దానిమ్మ రసం చెంచా చొప్పున, చిటికెడు పసుపు కలిపి ముఖానికి వేసుకోవాలి. పది నిమిషాలయ్యాక పాలని కాచి చల్లార్చిన తర్వాత అందులో దూదిని ముంచి ముఖంపై అద్దినట్లు చేయాలి. మర్దన చేస్తూ పూతను తొలగించుకోవాలి. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
ఒక స్పూన్ ఉప్పులో చెంచా రోజ్ వాటర్ కలిపి, అది కరిగిన వెంటనే ముఖానికి రాసుకోవాలి. మునివేళ్ళతో మెల్లిగా రెండు నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మంపై గల మృతకణాలు తగ్గిపోతాయి.
కీరదోసకి చర్మాన్ని మృదువుగా చేసే గుణం ఉంది. చిన్న కీరదోస ముక్కల్ని పేస్టు చేసుకోవాలి. తరువాత అందులో కొన్ని చుక్కలు రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసుకుంటే మీ ముఖం అందంగా కనిపిస్తుంది.
కోడిగుడ్డులోని తెల్లని సొనను బాగా నురగవచ్చే వరకు కలిపి ఒక స్పూను తేనె, స్పూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత వేడినీళ్లతో కడిగితే చర్మం మృదువుగా తయారవుతుంది.
శెనగపిండిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరాక కడిగేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. స్నానానికి వెళ్లేందుకు ముందుగా పచ్చి పసుపు పాల మీగడ కలిపి ముఖానికి రాసి ఇరవై నిమిషాల తరువాత స్నానం చేస్తుంటే క్రమేణా చర్మం తెల్లబడుతుంది.
About Writer
kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More