ఎండిన చామంతి పువ్వుల మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే?
గులాబీ పువ్వులు వాడిపోతే వాటిని పారేయకుండా నీడలో రెండుమూడు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. తడిపూర్తిగా పోయాక అరకప్పు వేడినీటిలో వేసి మూత పెట్టుకోవాలి. ఆ నీరు చల్లారిన తరువాత వడకట్టుకుని స్నానం చేసే నీటిలో
Publish Date: Sat, 11 Aug 2018 (17:03 IST)
Updated Date: Sat, 11 Aug 2018 (18:02 IST)
గులాబీ పువ్వులు వాడిపోతే వాటిని పారేయకుండా నీడలో రెండుమూడు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. తడిపూర్తిగా పోయాక అరకప్పు వేడినీటిలో వేసి మూత పెట్టుకోవాలి. ఆ నీరు చల్లారిన తరువాత వడకట్టుకుని స్నానం చేసే నీటిలో కలుపుకుంటే పొడి చర్మం కాస్త మృదువుగా మారుతుంది. అరకప్పు నీళ్లను మరిగించుకుని వాటిలో గుప్పెడు ఎండిన గులాబీ, మందార పువ్వుల రేకులను వేసి మూత పెట్టుకోవాలి.
5 నిమిషాల తరువాత ఈ నీటిని వడగట్టి అరచెంచా కొబ్బరినూనెను, పావుచెంచా మెత్తటి ఉప్పును కలుపుకుని ఒంటికి రాసుకోవాలి. అరగంట తరువాత స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఎండిన చామంతి పువ్వులను 5 తీసుకుని కొద్దిగా కొబ్బరినూనెలో కలుపుకుని ముద్దలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు స్పూన్స్ ఓట్స్ అవిసెగింజల పొడిని కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు రాసుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మృతుకణాలు తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా మారుతుంది. కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మనూనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More