పెరుగు, కాఫీ పొడితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే...
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులోని మంటను తగ్గించుటకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
Publish Date: Mon, 01 Oct 2018 (12:56 IST)
Updated Date: Mon, 01 Oct 2018 (13:32 IST)
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులోని మంటను తగ్గించుటకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీనిని మజ్జిగ రూపంలో తీసుకుంటే ఒత్తిడి, అలసట వంటి సమస్యలు తొలగిపోతాయి. పెరుగుతో అందానికి గల చిట్కాలు తెలుసుకుందాం.
పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం తాజాగా మారుతుంది. పెరుగులో కొద్దిగా గుడ్డు తెల్లసొన, ఉప్పు, చక్కెర కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
పెరుగులో కొద్దిగా కాఫీ పొడి, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. దాంతో మెుటిమలు, నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి. పెరుగులో బియ్యపు పిండి, బాదం నూనె కలిలి పేస్ట్ళా తయారుచేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More