మామిడి గుజ్జులో పచ్చిపాలు కలుపుకుని తీసుకుంటే? ముఖాన్ని మెరుగుపరుస్తుందా?
మామిడి గుజ్జును, పచ్చిపాలలో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం సహజ కాంతిని మెరుగుపరుస్తుంది. ముఖానికి, మెడకు ఈ పేస్టును రాయడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే నిమ్మరసం, పప్పు, పెరుగు, బియ్
Publish Date: Wed, 04 Jul 2018 (15:48 IST)
Updated Date: Fri, 06 Jul 2018 (15:58 IST)
మామిడి గుజ్జును, పచ్చిపాలలో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం సహజ కాంతిని మెరుగుపరుస్తుంది. ముఖానికి, మెడకు ఈ పేస్టును రాయడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే నిమ్మరసం, పప్పు, పెరుగు, బియ్యంలను కలిపి ముఖానికి వాడితే మంచి ఫలితాలను పొందవచ్చును. దీని వలన మృదువైన, కాంతివంతమైన, మెరుగైన చర్మాన్ని పొందుతారు.
నిమ్మపండు నుండి తాజా నిమ్మరసాన్ని సేకరించి దీనిలో ఒక చెంచా పంచదారను కలుపుకుని ఈ మిశ్రమాన్ని చర్మానికి నెమ్మదిగా రాసుకోవాలి. కాసేపు ఉంచిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
కొన్ని గ్రాముల బ్రెడ్ క్రంబ్స్, ఒక కప్పు మలైని కలిపి మీ ముఖానికి అద్దుకుంటే ఈ ఔషదం చర్మాన్ని మృదువుగా మార్చటమే కాకుండా సూర్యకాంతి వలన మారిన చర్మ రంగును కూడా తగ్గించి వేస్తుంది. చర్మానికి సహజ కాంతినిస్తుంది.
Kowsalya
Publish Date: Wed, 04 Jul 2018 (15:48 IST)
Updated Date: Fri, 06 Jul 2018 (15:58 IST)