చందనంలో కాస్త పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే?
ఈ కాలంలో ముఖచర్మం పొడిబారడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇటువంటి సమస్యల వలన రకరకాల క్రీములను వాడుతుంటారు. అవి చర్మం రంగును కోల్పోయేలా చేస్తాయి. అందువలన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ సమస్యలను తొలగ
Publish Date: Fri, 03 Aug 2018 (14:31 IST)
Updated Date: Fri, 03 Aug 2018 (14:38 IST)
ఈ కాలంలో ముఖచర్మం పొడిబారడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇటువంటి సమస్యల వలన రకరకాల క్రీములను వాడుతుంటారు. అవి చర్మం రంగును కోల్పోయేలా చేస్తాయి. అందువలన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ సమస్యలను తొలగించుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
బంగాళాదుంపలను ఉడకబెట్టుకున్న తరువాత వాటిని ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. కాసేపయ్యాక వాటిని తీసుకుని బాగా నలిపి ముఖానికి రాసుకోవాలి. దీంతో ముఖంలో నల్లటి వలయాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. నారింజ పండు తొక్కను ముఖంపై రుద్దుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
పసుపు, చందనములను పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. పచ్చిపాలను దూదిలో ముంచి ముఖానికి మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుంది. వంటసోడాలో కొద్దిగా నీటిని కలుపుకుని ముఖానికి రాసుకుంటే నల్లటి వలయాలు తొలగిపోతాయి.
కీరదోసకాయను మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. కొబ్బరినూనె, కర్పూరాన్ని మిశ్రమంగా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వలన కోమలమైన చర్మాన్ని పొందవచ్చును.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More