Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశంలో 270కి పైగా పట్టణాలకు అమెజాన్ ఫ్రెష్

Advertiesment
Amazon

ఐవీఆర్

, మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (17:24 IST)
బెంగుళూరు: అమెజాన్ ఇండియా ఈ రోజు, ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా దేశవ్యాప్తంగా 270కి పైగా పట్టణాలకు అమెజాన్ ఫ్రెషన్‌ను విస్తరింపజేస్తున్నట్లు ప్రకటించింది. తాజా పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు, గృహావసర వస్తుసామాగ్రులు, స్థానికంగా ప్రజలు మెచ్చిన వస్తువులతో సహా దైనందిన అవసరాలకు కావలసిన వస్తువులను భారతదేశవ్యాప్తంగా లక్షలాది కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావటానికి అమెజాన్ కట్టుబడి ఉన్నదనటానికి ఈ మైలురాయి నిలువుటద్దం. కొత్తగా చేరిన పట్టణాల్లో, ఉత్తరాదిన గోరఖ్ పుర్, డెహ్రాడూన్, జాలంధర్, జిర్కాపూర్; దక్షిణాదిన కోయంబత్తూర్, నెల్లూరు, హస్సన్, కొడగు, వరంగల్, విజయనగరం, వెల్లోర్, తిరుపతి, కొట్టాయం, కొల్లాం, హుబ్లి; తూర్పున జమ్‌షెడ్పూర్, ఆసన్సోల్, దుర్గాపూర్; ఇంకా మరెన్నో ఉన్నాయి.
 
అమెజాన్ ఫ్రెష్, కేవలం రెండేళ్ళ కాలంలో, చేరిక విషయంలో 4.5 రెట్లు పెరిగింది, ఎంపిక విషయంలో 10 రెట్లు పెరిగింది. దీనితో, భారతదేశవ్యాప్తంగా కుటుంబాలు తమ గ్రోసరీలను ఆన్­లైన్లో కొనే పద్ధతినే మార్చివేస్తోంది, అని శ్రీకాంత్ శ్రీ రామ్, డైరెక్టర్- అమెజాన్ ఫ్రెష్ ఇండియా అన్నారు. 270కి పైగా పట్టణాలకు విస్తరించటం ద్వారా మేము గృహావసరాలు, పండుగల్లో ప్రజలు మెచ్చే వస్తువులను గతంలో కంటే ఎక్కువ ఇళ్ళకు అందుబాటులోకి తీసుకువస్తున్నాము. అమెజాన్ ఫ్రెష్ విక్రేతల నెట్­వర్క్ విస్తరించిన కారణంగా, పట్టణాల వ్యాప్తంగా వారి ఉనికి పెరిగిన కారణంగా, దానితోపాటుగా అమెజాన్ వారి అధునాతన డెలివరీ సామర్ధ్యాల కారణంగా, భారతదేశంలో సర్వత్రా లభించే గ్రోసరీ నెట్వర్కును ఏర్పాటు చేయటం సాధ్యమయ్యింది. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా మేము తాజాదనాన్ని, పొదుపును, సౌలభ్యాన్ని డెలివర్ చేయటం పై దృష్టి సారించాము. తద్వారా కస్టమర్లకు, వారికి కావలసినవి అన్నీ లభించేట్లు, తాము అబిమానించే వ్యక్తులతో ఎక్కువ సమయం పండుగ క్షణాలను గడిపే అవకాశాన్ని కలిగిస్తున్నాము.
 
అమెజాన్ ఫ్రెష్ విక్రేతలు, భారతదేశవ్యాప్తంగా రిజిస్టర్ చేసుకుని ఉన్న 13,000ల మందికి పైగా రైతులతో ప్రత్యక్షంగా భాగస్వామ్యం ఏర్పపుచుకుని, పొలం-నుండి-గుమ్మం వద్దకు చేర్చే ఒక పటిష్టమైన నెట్వర్కును ఏర్పాటు చేశారు. కస్టమరుకు డెలివర్ చేసే ప్రతి వస్తువు, నాలుగు-అంచెల తీవ్రస్థాయి నాణ్యతా పరీక్షాప్రక్రియలను ఎదుర్కుంటుంది: స్థానిక కలెక్షన్ పాయింట్లు, గ్రేడింగ్ & సార్టింగ్, ఉష్టోగ్రతను-నియంత్రించే స్టోరేజ్ వద్ద, చివరకు నాణ్యతా పరీక్షల వద్ద తనిఖీ చేయబడతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ సీఎం స్టాలిన్.. ఒక్క కరూర్‌లోనే ఎందుకు జరిగింది? హీరో విజయ్ ప్రశ్న (Video)