అయోధ్య-కాశీ పుణ్య క్షేత్ర యాత్రను బైద్యనాథ్ ధామ్‌తో కలుపుతూ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రారంభించినట్లు ఐఆర్టీసీ ప్రకటించింది. ఈ రైలు సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది.
ఈ తీర్థయాత్ర పర్యటన ఒడిశాలోని జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, జార్ఖండ్‌లోని బాబా బైద్యనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయం, సాయంత్రం గంగా ఆరతి, రామ జన్మభూమి, హనుమాన్‌గరి, ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలను కవర్ చేస్తుంది.
ఈ ప్రయాణం తొమ్మిది రాత్రులు, పది రోజులు ఉంటుంది. ఇందులో రైలు, రోడ్డు ప్రయాణం, వసతి, అన్ని కోచ్‌లలో ఐఆర్టీసీ సిబ్బంది పూర్తి సహాయం ఉంటాయి.