Publish Date: Fri, 03 Jul 2026 (18:55 IST)
Updated Date: Fri, 03 Jul 2026 (18:56 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. 300 రోజుల కాలపరిమితితో ఆకర్షణీయమైన సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఎక్కువ కాలం కనెక్టివిటీని కోరుకునే వారి కోసం రూ.1,499 ప్లాన్ వోచర్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
ఈ ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ, రోమింగ్)తో పాటు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. అలాగే, ప్లాన్ గడువు ముగిసేవరకు మొత్తం 32 జీబీ హై-స్పీడ్ డేటా అందుబాటులో ఉంటుంది. నిర్ణీత డేటా కోటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.
దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా సెకండరీ సిమ్ కార్డును ఉపయోగించే వారికి లేదా తక్కువ డేటా అవసరమున్న వారికి ఇది అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.
గతంలో ఈ ప్లాన్ ద్వారా 336 రోజుల వ్యాలిడిటీతో పాటు 24 జీబీ డేటాను అందించేవారు. అయితే, ఇటీవలి సవరణల ప్రకారం వ్యాలిడిటీని 300 రోజులకు తగ్గించి, డేటాను మాత్రం 32 జీబీకి పెంచారు. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తమ టారిఫ్ ధరలను పెంచుతున్న తరుణంలో, బీఎస్ఎన్ఎల్ తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించడంపై దృష్టి సారించింది.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
Read More