Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ నోట్ల రద్దు నాటి పరిస్థితి.. కర్ణాటకలో భారీగా నకిలీ కరెన్సీ...

దేశంలో నోట్ల రద్దు పరిస్థితి ఏర్పడింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో నోట్ల రద్దుతో అప్పట్లో ఏర్పడిన కరెన్సీ నోట్ల కొరత మళ్లీ రిపీట్ అయ్యింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, గుజరాత్‌, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్

Advertiesment
Fake currency
, బుధవారం, 18 ఏప్రియల్ 2018 (14:45 IST)
దేశంలో నోట్ల రద్దు పరిస్థితి ఏర్పడింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో నోట్ల రద్దుతో అప్పట్లో ఏర్పడిన కరెన్సీ నోట్ల కొరత మళ్లీ రిపీట్ అయ్యింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, గుజరాత్‌, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్‌తో పాటు చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు, ఏటీఎంలలో నగదులేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాష్ట్రాల్లోని ఏటీఏం మెషీన్లపై నో క్యాష్ అనే బోర్డు కనిపిస్తోంది.
 
పలు రాష్ట్రాల నుంచి రిజర్వు బ్యాంకుకు, ప్రభుత్వానికి నగదు కొరతపై ఫిర్యాదులు అందడంతో.. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ తాజాగా రిజర్వు బ్యాంకు అధికారులతో సమావేశమైంది. అలాగే దేశంలోని పలు ఏటీఎంల వద్ద జనాలు గంటల తరబడిబారులు తీరుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో పలువురు నగదు కోసం పెళ్లి కార్డులను తీసుకువెళ్లి బ్యాంకు అధికారులను డబ్బు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు. 
 
అయితే కర్ణాటకలో భారీగా నకిలీ కరెన్సీని పట్టుబడింది. బెళగావిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు రూ.7 కోట్లు విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. కాగా, కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో నకిలీ కరెన్సీ పట్టుబడటం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓటర్లను మభ్యపెట్టేందుకు రాజకీయ పార్టీల నేతలు రంగంలోకి దిగుతున్నారని అనుమానాలొస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో ఇంటర్నెట్ కొత్తకాదు.. మహాభారతం కాలం నుంచే ఉంది : త్రిపుర సీఎం