దేశంలో బంగారు రుణాలు ఆల్‌టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. ఈ యేడాది ఆగస్టు నాటికి బ్యాంకులు గోల్డ్ లోడ్ పోర్ట్‌పోలియో ఏకంగా రూ.2.94 లక్షల కోట్ల జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇా పసిడి రుణాలు ఆల్‌టైమ్ రికార్డుకు చేరడం ఇది వరుసగా 15వ నెల కావడం గమనార్హం.
వాస్తవానికి దేశంలో బంగారు ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. అదేసమయంలో తమ ఆర్థిక అవసరాల కోసం బంగారంపై రుణాలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. బంగారం విలువ పెరగడంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇస్తున్న గోల్డ్ లోన్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి బ్యాంకుల గోల్డ్ లోన్ పోర్టుపోలియో ఏకంగా రూ.2.94 లక్షల కోట్ల జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరింది.
కేవలం యేడాది వ్యవధిలో 10 గ్రాముల బంగారం ధర 53 శాతం పెరిగింది. 2024 ఏప్రిల్లో రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్న గోల్డ్ లోన్ పోర్టు పోలియో ఇప్పుడు దాదాపు మూడు రెట్లు పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ యేడాది మార్చి నుంచి ప్రతినెలా ఈ రుణాల్లో వార్షిక ప్రాతిపదికన 100 శాతానికి పైగా వృద్ధి నమోదవుతోంది.