Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GST ప్రయోజనాలను అందించేందుకు లెక్సస్ ఇండియా ధర తగ్గింపుల ప్రకటన

Advertiesment
Lexus cars

ఐవీఆర్

, సోమవారం, 8 సెప్టెంబరు 2025 (19:51 IST)
లెక్సస్ ఇండియా ఇవాళ చాలా కీలకమైన ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం... తమ మొత్తం ఉత్పత్తుల రేంజ్‌లో ధరల తగ్గింపును ప్రకటించింది. ఇటీవలే కేంద్రం ప్రభుత్వం GST రేట్లను సవరించడంతో వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలను తమ గెస్ట్‌లకే పూర్తిగా అందించబోతోంది లెక్సస్ ఇండియా. ఇలా గెస్ట్‌లకే ప్రయోజనాల్ని అందించడం ద్వారా లెక్సస్.. గెస్ట్‌ల పట్ల తమకున్న దృఢమైన నిబద్ధతను నొక్కి చెబుతుంది. అదే సమయంలో లగ్జరీ మొబిలిటీకి ప్రాప్యతను మరింత పెంచుతుంది. సవరించిన ధరలు 22 సెప్టెంబర్ 2025 నుండి అమలులోకి వస్తాయి.
 
ఈ ప్రకటన సందర్భంగా, లెక్సస్ ఇండియా అధ్యక్షుడు శ్రీ హికారు ఇకేయుచి మాట్లాడుతూ, ఈ చారిత్రాత్మక  సంస్కరణకు భారత ప్రభుత్వానికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న మా విలువైన గెస్ట్ లకు GST రేటు తగ్గింపు యొక్క పూర్తి ప్రయోజనాన్ని అందించడానికి మేము సంతోషిస్తున్నాము. దీనివల్ల గెస్ట్‌లతో మాకు మరింత యాక్సెసిబిలిటీ పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. లగ్జరీ మొబిలిటీ స్పేస్‌లో గెస్ట్‌లకు మామీద మరింత విశ్వాసం పెరుగుతుంది. ఈ పండుగ సీజన్ ప్రారంభంలో వస్తున్న ఈ రేటు తగ్గింపు ప్రయోజనం... ఆనందాన్ని అందిస్తుంది. మా అతిథులు లెక్సస్ శ్రేణి వాహనాలను అనుభవించడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది అని అన్నారు.
 
లెక్సస్‌లో ప్రతి నిర్ణయం ఓమోటేనాషి స్ఫూర్తితో మార్గనిర్దేశం చేయబడుతుంది. నిజంగా అర్థవంతమైన అనుభవాలను అందిస్తూనే మా గెస్ట్‌ల అవసరాలను తీర్చే అద్భుతమైన, ప్రత్యేక విధానం ఇది. ఈ ప్రయోజనాలను పూర్తిగా విస్తరించడం ద్వారా, మేము ఈ సంస్కరణను మరింత ఆనందంగా జరుపుకుంటాము. అంతేకాకుండా లెక్సస్ యాజమాన్యాన్ని చిరస్మరణీయంగా, లోతుగా వ్యక్తిగతంగా మార్చాలనే మా వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తున్నాము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

BSA గోల్డ్ స్టార్, పరిమిత ఎడిషన్ గోల్డీ కిట్ ప్రకటన