Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రత్లాం రైల్వే డివిజన్ కోసం ప్రతిష్టాత్మక ట్రైన్ డిస్‌ప్లే బోర్డ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన MIC ఎలక్ట్రానిక్స్

Advertiesment
Train boards

ఐవీఆర్

, సోమవారం, 16 డిశెంబరు 2024 (19:33 IST)
ఎల్‌ఈడీ వీడియో డిస్‌ప్లేలు మరియు ఎలక్ట్రానిక్ సొల్యూషన్‌ల రూపకల్పన, అభివృద్ధి, తయారీలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న నగరానికి చెందిన MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో జాబితా చేయబడింది), పశ్చిమ రైల్వే జోన్‌లోని రత్లాం డివిజన్‌లో తన ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ లెటర్ ఆఫ్ కంప్లీషన్/ఇన్‌స్టలేషన్ సర్టిఫికేట్‌ను అందుకుంది, ఇది భారతీయ రైల్వేలతో భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
 
ఈ సమగ్ర ప్రాజెక్ట్ ఇండోర్‌లో కోడల్ ప్రాతిపదికన ఐదు-లైన్ రైలు డిస్‌ప్లే బోర్డులను మార్చడం, NMH (NIMACH) ప్లాట్‌ఫారమ్ 2 వద్ద కొత్త CGDB (కోచ్ గైడెన్స్ డిస్‌ప్లే బోర్డ్)తో పాటు సమాచార ప్రదర్శన బోర్డులు, MEA కింద 33 స్టేషన్లు వద్ద GPS గడియారాలతో సహా అనేక క్లిష్టమైన ఇన్‌స్టాలేషన్‌లను కలిగి ఉంది. వీటితో పాటుగా ఏడు స్టేషన్లలో సమాచార ప్రదర్శన బోర్డుల మార్చటం కూడా ఉంది. 
 
ఈ విజయం పై MIC-సీఈఓ, రక్షిత్ మాథుర్ మాట్లాడుతూ, "ఈ కీలకమైన ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయటం తో పాటుగా భారతీయ రైల్వేలను సంతృప్తిపరిచినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ విజయం మా ఖాతాదారుల ప్రత్యేక అవసరాలకు అనుకూలీకరించిన వినూత్న మరియు నమ్మదగిన పరిష్కారాలను అందించడంలో మా అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. భవిష్యత్తులో ఇటువంటి ముఖ్యమైన పనులను చేయడానికి,  భారతీయ రైల్వేలతో కలిసి పని చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌