Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిలయన్స్ జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్స్‌

Advertiesment
jio reliance

ఠాగూర్

, సోమవారం, 12 మే 2025 (14:24 IST)
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆదేశాల మేరకు రిలయన్స్ జియో సరికొత్తగా మరో రెండు రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. కేవలం ఫోన్ కాలింగ్, ఎస్ఎంఎస్‌లు ఉపయోగిస్తూ డేటా అవసరం లేని యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్లలో ఒకటి రూ.458 విలుతో 84 రోజుల కాలపరిమితి ఉండేలా తెచ్చింది. అలాగే, రూ.1958 ధరతో 365 రోజుల కాలపరిమితితో తీసుకొచ్చింది. 
 
జియో కొత్తగా రూ.458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అపరిమిత కాలింగ్ 1000 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దేశ వ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత రోమింగ్ సౌకర్యం ఉంటుంది. దాంతో పాటు యూజర్లు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లను కూడా ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. 
 
రూ.1958తో తీసుకొచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల దీర్ఘకాలిక చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌ల యూజర్లు దేశంలో అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమత కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు. అలాగే 3600 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ఉచిత జాతీయ రోమింగ్ సౌకర్యం ఉంటుంది. దీంతో పాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లను ఉచిత్ యాక్సెస్ లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ పనిబట్టిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి!!