Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెపాసిట్ఈ తో రూ. 1203 కోట్ల నిర్మాణ ఒప్పందం చేసుకున్న సిగ్నేచర్ గ్లోబల్

Advertiesment
Buildings

ఐవీఆర్

, మంగళవారం, 29 అక్టోబరు 2024 (19:24 IST)
భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటైన సిగ్నేచర్ గ్లోబల్, సెక్టార్ 71, గురుగ్రామ్‌ వద్ద అభివృద్ధి చేయనున్న తమ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, టైటానియం SPR కోసం నిర్మాణ కాంట్రాక్టును అందజేసినట్లు ప్రకటించింది. రూ. 1203 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ కెపాసిట్ ఈ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు అప్పగించారు.
 
14.382 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ టైటానియం SPRలో 3.5 BHK, 4.5 BHKతో కూడిన మొత్తం 608 యూనిట్లు ఉంటాయి. రెండు దశలలో అభివృద్ధి చేయనున్న 3.7 మిలియన్ చదరపు అడుగుల ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి దశ 2.1 మిలియన్ చ.అ.లను కలిగి ఉంది. ఇది జూన్ 2024 నెలలో ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్టుకు అద్భుతమైన స్పందనను లభించింది. ప్రీ-సేల్ సంఖ్య రూ. 2700 కోట్ల కంటే ఎక్కువ.
 
సిగ్నేచర్ గ్లోబల్ యొక్క ఛైర్మన్- హోల్-టైమ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ అగర్వాల్ మాట్లాడుతూ, “ప్రీమియం జీవన అనుభవాలను అందించాలనే మా నిబద్ధతను టైటానియం SPR  ప్రదర్శిస్తుంది. మా మొదటి ప్రీమియం ప్రాజెక్ట్‌లలో ఒకటి అయినప్పటికీ, ఇది కస్టమర్‌ల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. కెపాసిట్ ఈ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా, టైటానియం SPR ఢిల్లీ NCR ప్రాంతంలో ఒక మైలురాయిగా ఉద్భవించగలదని మేము విశ్వసిస్తున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెక్కీ హత్య కేసు : హంతకుడి ఆచూకీ చెబితే రూ.5.7 కోట్ల రివార్డు