Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆయిల్‌ కంట్రీ ట్యుబులర్‌ (ఓసీటీఎల్‌) దివాళా కేసులో తెలంగాణా హైకోర్టు తీర్పును నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు

Advertiesment
Supreme Court
, గురువారం, 18 మార్చి 2021 (17:54 IST)
ప్రాస్పెక్టివ్‌ రిజల్యూషన్‌ అప్లికెంట్‌ (పీఆర్‌ఏ) దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ పైన 03.03.2021వ తేదీన గౌరవనీయ భారత సుప్రీంకోర్టు తన ఆదేశాలను జారీ చేస్తూ హైదరాబాద్‌లోని తెలంగాణా రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన తీర్పు ఉత్తర్వ్యులను నిలుపుదల చేసింది. ఓసీటీఎల్‌ మాజీ ప్రమోటర్‌ దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌కు అనుగుణంగా మాజీ ప్రమోటర్‌ ప్రతిపాదించిన ఒన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కాకుండా మరే ఇతర ప్రతిపాదనలనూ కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ (సీఓసీ) చేయరాదని గౌరవనీయ తెలంగాణా రాష్ట్ర హైకోర్టు 16.11.2020వ తేదీన తమ ఉత్తర్వులను అందించింది.
 
పైప్‌ ఫినీషింగ్‌ వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓసీటీఎల్‌ తమ వ్యాపారాలను 2016లో మూసివేసింది. గత నాలుగు సంవత్సరాలుగా బ్యాంకులు మరియు ప్రమోటర్ల నడుమ ఓటీఎస్‌ కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే, ప్రమోటర్లు తమ వాగ్ధానాన్ని నిలుపుకోవడంలో పలుమార్లు విఫలం కావడం ద్వారా కంపెనీని గందరగోళంలో పడేశారు. 
 
మొత్తంమ్మీద మూడు పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంకులకు 150 కోట్ల రూపాయల వరకూ బాకీ పడ్డారు. కార్పోరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్‌ ప్రాసెస్‌ (సీఐఆర్‌పీ) ప్రక్రియలో అధికంగా ఆలస్యం కావడమనేది ఐబీసీ(ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌) స్ఫూర్తికి విరుద్ధం. ఇది మరింతగా ఓసీటీఎల్‌ యొక్క ప్రాథమిక విలువను దిగజారుస్తుంది. సీఐఆర్‌పీ ప్రకారం ఓపెన్‌ బిడ్డింగ్‌తో 80 కోట్ల రూపాయల వరకూ పొందవచ్చని మార్కెట్‌ ఇంటిలిజెన్స్‌ సూచించినప్పటికీ ఓటీఎస్‌తో దాదాపు 70 కోట్ల రూపాయలకు అయినాసరే అనేందుకు బ్యాంకులు చురుగ్గా అవకాశాలను పరిశీలిస్తున్నాయి.
 
గౌరవనీయ జాతీయ కంపెనీ లా అప్పెలట్‌ ట్రిబ్యునల్-ఢిల్లీ వద్ద సీఐఆర్‌పీ ప్రక్రియ ఆలస్యం కావడంపై గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. దానికనుగుణంగా 07.12.2020వ తేదీన ఐబీసీ 2016 మార్గదర్శకాలకనుగుణంగా నిర్ధేశిత కాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది కానీ గౌరవనీయ తెలంగాణా రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ కార్పోరేట్‌ డెబ్టార్‌ యొక్క సీఐఆర్‌పీని వాయిదా వేసింది.
 
గౌరవనీయ తెలంగాణా రాష్ట్ర హైకోర్టు 16.11.2020వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేయాల్సిందిగా గౌరవనీయ సుప్రీంకోర్టును కోరుతూ స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ దాఖలు చేయగా, తదనుగుణంగా సుప్రీంకోర్టు తన ఆదేశాలను జారీచేసింది.
 
శ్రీ శశాంక్‌ మనీష్‌, అడ్వొకేట్‌- రికార్డ్‌ ఫర్‌ పీఆర్‌ఏ, భారత సుప్రీంకోర్టు మాట్లాడుతూ, ‘‘సీఓసీని నియంత్రించకూడదని గౌరవనీయ సుప్రీంకోర్టు భావించిన కారణంగానే ఈ ఆర్డర్ల అమలును నిలుపుదల చేసింది. కార్పోరేట్‌ డెబ్టార్‌ యొక్క సీఐఆర్‌పీని సకాలంలో పునరుద్ధరించడం సాధ్యం కావడంతో పాటుగా దివాళా ప్రక్రియను ఖచ్చితంగా కాలపరిమితితో పూర్తి చేయడం వీలవుతుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 218 కరోనా కేసులు.. కరోనా వ్యాక్సినేషన్‌ తీసుకున్నాక కరోనా సోకితే..?