Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యుత్తమ అథ్లెటిక్ ప్రతిభతో విజయాలను సాధించిన కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్ విద్యార్థులు

Advertiesment
KLH Bachupally Campus Students

ఐవీఆర్

, గురువారం, 26 డిశెంబరు 2024 (20:36 IST)
అత్యుత్తమ క్రీడా విజయాలు, విద్యావిషయక విజయాలతో కూడిన ఒక సంవత్సరాన్ని కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్ జరుపుకుంది. తామెంచుకున్న  రంగాలలో రాణిస్తున్న విద్యార్థి-అథ్లెట్లకు ప్రోత్సాహక మైదానంగా ఈ క్యాంపస్ గుర్తించబడింది. ఈ సంవత్సరం, పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణిస్తోన్న తమ విద్యార్థుల అసాధారణ ప్రతిభను ప్రదర్శింప చేస్తూనే వారికి స్ఫూర్తి కేంద్రంగా క్యాంపస్ నిలిచింది.
 
న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్ స్కేట్ ఓషియానియా, పసిఫిక్ కప్ ఛాంపియన్‌షిప్ 2024లో 18 ఏళ్ల కళాత్మక రోలర్ స్కేటర్ పడిగా తేజేష్ అద్భుతమైన ప్రదర్శనకారుల సరసన నిలిచారు. తేజేష్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్‌లో బంగారు పతకం, సోలో డ్యాన్స్ స్కేటింగ్‌లో రజతం, క్వాడ్ ఫ్రీస్టైల్ ఆర్టిస్టిక్ రోలర్ విభాగంలో కాంస్యం సాధించారు. క్యాంపస్ యొక్క విజయాలకు మరింత వన్నె తెస్తూ, కెఎల్‌హెచ్‌ బాచుపల్లికి చెందిన అద్భుతమైన స్విమ్మర్ సాయి నిహార్, ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా గేమ్స్‌లో బంగారు పతకంతో పాటు వివిధ ఆల్ ఇండియా పోటీలలో రజతం, కాంస్య పతకాలను సాధించాడు.
 
కెఎల్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి. పార్థ సారధి వర్మ ఈ విజయాలను కొనియాడుతూ, "యూనివర్శిటీలో మా ఫిలాసఫీ సూటిగా ఉంటుంది. ఉద్దేశ్యంతో అభిరుచిని పెంపొందించడం ద్వారా గొప్పతనాన్ని సాధిస్తాము. తేజేష్, సాయిల విజయాలు, మా వివిధ క్యాంపస్ల నుండి అనేక మంది పట్టుదల, క్రమశిక్షణ, సమతుల వృద్ధి యొక్క శక్తివంతమైన కలయికకు నిదర్శనం. వారి ఆశయాలకు మద్దతు ఇవ్వడం, వారి విజయాన్ని వేడుక జరుపుకోవడం పట్ల మేము చాలా గర్వంగా ఉన్నాము" అని అన్నారు. 
 
సౌత్ జోన్ పోటీలో బంగారు పతకాన్ని సాధించడమే కాకుండా ఆల్-ఇండియా ఇంటర్-యూనివర్శిటీ ఛాంపియన్‌షిప్ 2023-24లో రజత పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు టి. రాహుల్ ఆజాద్ వంటి ఇతర క్రీడా తారలు కూడా క్యాంపస్‌లో ఉన్నారు. అతని ఆదర్శప్రాయమైన ప్రదర్శన, విజయవాడలోని ఏజి కార్యాలయంలో గౌరవనీయమైన ప్రభుత్వ పదవిని సంపాదించిపెట్టింది. అదేవిధంగా, దీపికా మాడుగుల బ్యాడ్మింటన్‌లో రాణించి, సీనియర్ జాతీయ పోటీలో బంగారు పతకం, దక్షిణ మధ్య రైల్వేలో వుద్యోగం సంపాదించింది.
 
సిహెచ్ ప్రణతి ఈ సంవత్సరం వివిధ రాష్ట్ర, జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పదకొండు పతకాలను సాధించడం ద్వారా తన అసాధారణమైన రైఫిల్ షూటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అదనంగా, విశిష్ట టేబుల్ టెన్నిస్ ఆటగాడు అయిన వృషిన్, గత సంవత్సరం ప్రారంభంలో జరిగిన స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మరియు ఇంటర్నేషనల్ మెన్స్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని సాధించడం ద్వారా క్యాంపస్ గౌరవాన్ని మరింతగా ఇనుమడింప చేసాడు. అతని విజయ పరంపర అంతర్జాతీయ పురుషుల సింగిల్స్‌లో కాంస్యం, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతంతో కొనసాగింది మరియు మిక్స్‌డ్ డబుల్స్ మరియు పురుషుల టీమ్ ఈవెంట్‌లో అదనపు కాంస్య పతకాలతో సంవత్సరాన్ని ముగించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : బీజేపీ నేత శపథం!!