Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థులకు ఇది పరీక్షా కాలం : ఇన్ఫోసిన్ కో-ఫౌండర్ నారాయణమూర్తి

విద్యార్థులకు ఇది పరీక్షా కాలమని, కఠిన పోటీని ఎదుర్కొని విజయం సాధించాల్సిన పరిస్థితులు నెలకొనివున్నాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన పద్మవిభూషణ ఎన్ఆర్.నారాయణమూర్తి అన్నారు.

Advertiesment
SRM University
విద్యార్థులకు ఇది పరీక్షా కాలమని, కఠిన పోటీని ఎదుర్కొని విజయం సాధించాల్సిన పరిస్థితులు నెలకొనివున్నాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన పద్మవిభూషణ ఎన్ఆర్.నారాయణమూర్తి అన్నారు. చెన్నైలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని వేలాది మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
 
విద్యార్థులు కఠినమైన సవాళ్ళను, పోటీని ఎదుర్కొని విజయాన్ని సాధించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్లోబలైజేషన్ కారణంగా కంపెనీల మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొనివుందన్నారు. అందువల్ల విద్యార్థులు తమలోని నైపుణ్యానికి మరింతగా మెరుగులు దిద్దుకుని ముందుకు సాగాల్సిన తరుణమిదన్నారు. అలాగే, తమ మేథోసంపత్తికి పదనుపెట్టుకుని కొత్త కొత్త ఆవిష్కరణలు కనుగొనాల్సి ఉందన్నారు.
SRM University
 
జాతిపిత మహాత్మా గాంధీ తరహాలో విద్యార్థులు కూడా ప్రజల మన్నలు పొందుతూ వారి నమ్మకాన్ని పొందాలన్నారు. జాతిపిత ప్రతి ఒక్క భారతీయుడి ప్రశంస, ఆదరాభిమానాలు పొందారని గుర్తు చేశారు. ఆయనలాగే ప్రతి విద్యార్థి కూడా నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగాలని నారాయణమూర్తి పిలుపునిచ్చారు. ముఖ్యంగా, సమాజంలోని ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలు పొందాలన్నారు. ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించుకుని, కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు సాగాలని నారాయణమూర్తి విద్యార్థిలోకానికి పిలుపునిచ్చారు. 

ప్రపంచీకరణలో పోటీ వాతావరణం పెరిగిందన్నారు. ప్రస్తుతం కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలకు పోటీ విపరీతంగా ఉన్నదని నారాయణమూర్తి అన్నారు. సృజనాత్మకతను వేగంగా అంది పుచ్చుకుంటేనే మంచి అవకాశాలు లభిస్తాయని ఆయన విద్యార్థులకు సూచించారు. కాగా, ఈ స్నాతకోత్సవంలో భారత అణుశక్తి కమిషన్ ఛైర్మన్‌, కేంద్ర అణుశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ శేఖర్ బసుకు గౌరవ డాక్టరేట్‌ను ఆయన ప్రదానం చేశారు.
SRM University


అలాగే, వివిధ శాఖల్లో తొలి మూడు ర్యాంకులు సాధించిన, వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీలు పూర్తి చేసిన 47 మంది విద్యార్థులకు నారాయణమూర్తి డిగ్రీలను అందజేశారు. అలాగే స్నాతకోత్సవం సందర్భంగా ఇంజినీరింగ్‌, సాంకేతిక విభాగాల్లో 6150 మంది గ్రాడ్యుయేట్లు, 47 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు యూనివర్సిటీ పట్టాలను అందించారు.
SRM University
 
ఈ కార్యక్రమానికి ఎస్ఆర్ఎం వర్శిటీ చాన్సెలర్ డాక్టర్ పారివేందర్ అధ్యక్షత వహించగా, యూనివర్శిటీ ఛైర్మెన్ ఆర్.పి సత్యనారాయణ ఆహుతులకు స్వాగతం పలికారు. ఉపకులపతి వార్షిక నివేదికను చదివి వినిపించారు. మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు బంగారు, వెండి, రజతం పతకాలను ప్రదానం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై అకౌంట్ పోర్టబులిటీ : ఒకే బ్యాంక్ ఒకే అకౌంట్