Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోను కాబట్టి డీఎన్ఎ పరీక్షకు ఒప్పుకోనంటే కుదురుతుందా.. ఇలాగైతే ధనుష్ నిండా ఇరుక్కున్నట్లే

ఒక కేసు విషయంలో పలానా పరీక్షకు నేను సిద్ధపడను అని ఎవరైనా అన్నారంటే అది తన వ్యక్తిస్వేచ్చ పరిరక్షణకు చట్టం ఇచ్చిన అవకాశంలో భాగంగా ఉంటుంది. లేదా పరీక్షకు సిద్ధపడితే ఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తే ఎలా మీమాంసలో భాగంగా కూడా పరీక్షకు వ్యతిరేకత తెలుపవచ్చు.

Advertiesment
dhanush
హైదరాబాద్ , గురువారం, 13 ఏప్రియల్ 2017 (01:31 IST)
ఒక కేసు విషయంలో పలానా పరీక్షకు నేను సిద్ధపడను అని ఎవరైనా అన్నారంటే అది తన వ్యక్తిస్వేచ్చ పరిరక్షణకు చట్టం ఇచ్చిన అవకాశంలో భాగంగా ఉంటుంది. లేదా పరీక్షకు సిద్ధపడితే ఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తే ఎలా మీమాంసలో భాగంగా కూడా పరీక్షకు వ్యతిరేకత తెలుపవచ్చు. కానీ తమిళ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ అలా వ్యతిరేకత తెలిపితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
 
తాజా సమాచారం ప్రకారం తాను ఫలానా వారి కుమారుడిని అవునా, కాదా అనేది రుజువు చేసుకోవడంపై నడుస్తున్న కేసులో డీఎన్ఏ పరీక్షకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని సినీ హీరో ధనుష్ తేల్చి చెప్పేశారు. ధనుష్‌ తమ కొడుకు అంటూ మదురై జిల్లా మేలూర్కు చెందిన కదిరేశన్‌–మీనాక్షి దంపతులు మదురై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో మొదలైన కలకలం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 
 
ఈ కేసు ప్రస్తుతం మూలమలుపు తిరిగింది. ధనుష్ తమ కుమారుడేనని కేసుపెట్టిన కదిరేశన్, మీనాక్షీ దంపతులు ధనుష్‌ తమ కొడుకేనని నిరూపించడానికి తాము డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధం అని మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. తమిళనాడు కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. కదిరేశన్ దంపతుల ఆరోపణల్లో 
నిజం లేదని, అందుకు ఆధారాలు తాము ఇప్పటికే కోర్టుకు సమర్పించామని ధనుష్‌ తరఫు న్యాయవాది వాదించారు. 
 
అయితే డీఎన్‌ఏ పరీక్షకు అంగీకరించబోమని, అది నటుడు ధనుష్‌ ఆత్మవిశ్వాసానికి, స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ తేదీని ప్రకటించకుండా వాయిదా వేశారు. 
 
వాయిదా సరే.. కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో ధనుష్ డీఎన్ఏ పరీక్షకు అంగీకరించకపోవడం అతడి నైతిక ఓటమిని రుజువు చేస్తోందని నిపుణులు అంటున్నారు. చట్టంలో వ్యక్తిస్వేచ్చ పరిరక్షణన అవకాశాన్ని లొసుగుగా తీసుకోవచ్చు కానీ వ్యక్తి నిబద్ధతను అది ప్రశ్నిస్తూనే ఉంటుందని, సమాజం  దృష్టిలో ఇది శాశ్వతంగానే ధనుష్‌ను దోషిలా నిలబెడుతుందని చెబుతున్నారు.
 
డీఎన్‌ఏ పరీక్షకు కూర్చోవడం... కూర్చోకపోవడం ధనుష్ అంతరాత్మకు సంబంధించిన విషయం. కానీ రేపు కోర్టు నిజంగానే ధనుష్ డీఎన్‌ఏ పరీక్షకు కూర్చోవలసిందే అని ఖరాఖండీగా ఆదేశిస్తే అప్పుడు కూడా పరువు పోయేది సినీహీరోదే కదా.!
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం చంద్రబాబును తెలంగాణ-ఉత్తరప్రదేశ్ ఆదర్శంగా తీసుకున్నాయ్... మంత్రి సోమిరెడ్డి