Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్న డీడీ అధ్యక్షుడు కృష్ణారావు

Advertiesment
krishna rao
, శుక్రవారం, 7 అక్టోబరు 2022 (08:30 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా మార్పు చేస్తూ ఆ నూతన పార్టీకి భారత రాష్ట్ర సమితి అనే నామకరణ చేసే కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి అనేక రాజకీయ పార్టీల నేతలకు స్వయంగా ఫోన్ ద్వారా సంప్రదించి అతిథులుగా ఆహ్వానం పలికారు. తమిళనాడు రాష్ట్రం నుంచి విడుదలై చిరుత్తైగళ్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యులు తిరుమావళవన్, ద్రావిడ దేశం అధినేత వి.కృష్ణారావును ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.‌
krishna rao
 
చెన్నై నుండి హైదరాబాద్‌కు వెళ్లిన ఈ ఇద్దరు నేతలను తెరాస నేతలు బాల్క సుమన్, శాసనమండలి సభ్యులు కౌసిక్ రెడ్డిలు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలుసుకున్న కృష్ణారావు అభినందనలు తెలియజేయడమే కాకుడా, తమిళనాడులోని తెలుగువారికి అందుబాటులో ఉండే విధంగా 'తెలంగాణ భవన్' అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.‌ ఈ కార్యక్రమంలో తరుమావళవన్‌తో పాటు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోడీ ప్రారంభించిన 'వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్'కు ప్రమాదం...