Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

Advertiesment
Balayya- daku

ఠాగూర్

, ఆదివారం, 5 జనవరి 2025 (12:31 IST)
నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డాకు మహారాజ్'. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 
 
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు అందరూ ఎంతగానో ఎదుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
 
'డాకు మహారాజ్' ట్రైలర్ విడుదల కార్యక్రమం డల్లాస్ లో ఘనంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 8:39 కి ట్రైలర్ ను విడుదల చేశారు. 2 నిమిషాల 44 సెకన్ల నిడివితో రూపొందిన 'డాకు మహారాజ్' ట్రైలర్ అద్భుతంగా ఉంది. "అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డ వాళ్ళంతా ఆయనను డాకు అనేవాళ్ళు. మాకు మాత్రం మహారాజ్." అంటూ ఒక పాప వాయిస్ తో ట్రైలర్ ను ప్రారంభించిన తీరు మెప్పించింది. 
 
డాకు మహారాజ్‌గా బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు అమోఘం. నందమూరి బాలకృష్ణ పాత్ర విభిన్న కోణాలను కలిగి ఉంది. విభిన్న రూపాలలో ఆయన సరికొత్తగా కనిపిస్తున్నారు. మొదట డాకు మహారాజ్ గా, తరువాత ఒక చిన్నారిని రక్షించే నానాజీగా విభిన్న కోణాలలో కనిపిస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి బాలకృష్ణను మునుపెన్నడూ చూడని అవతార్‌లో అభిమానులు, ప్రేక్షకులు మెచ్చేలా సరికొత్తగా చూపిస్తున్నారు. 
 
బలమైన కథాకథనాలతో.. హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో అద్భుతమైన చిత్రంగా 'డాకు మహారాజ్' రూపుదిద్దుకుందని ట్రైలర్ తో స్పష్టమైంది. ట్రైలర్ లో డాకు మహారాజ్ ని ఢీ కొట్టే బలమైన ప్రతినాయకుడి పాత్రలో బాబీ డియోల్ కనిపిస్తున్నారు. అలాగే కీలక పాత్రధారులైన శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, మకరంద్ దేశ్‌పాండే పాత్రలను కూడా ట్రైలర్ లో పరిచయం చేశారు. విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ట్రైలర్ లో విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కొన్ని విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉన్నాయి. ఇక సంచలన స్వరకర్త తమన్ తనదైన నేపథ్య సంగీతంతోమరోసారి కట్టిపడేశారు.
 
మొత్తానికి డాకు మహారాజ్ ట్రైలర్ ఒక మంచి విందు భోజనంలా ఉంది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్ళాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో కలిసి దర్శకుడు బాబీ కొల్లి, థియేటర్లలో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించబోతున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
 
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా
సంగీతం: తమన్ ఎస్ 
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్
కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్
దర్శకత్వం: బాబీ కొల్లి 
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్ 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం : దర్శకుడు వి.ఎన్.ఆదిత్య