కుక్కర్‌తో వంట చేస్తుంటే ఇవి తప్పక తెలుసుకోవాలి...
కుక్కర్లో కొలత ప్రకారం నీటిని పోసుకోవాలి. కంటైనర్స్ ఒరగకుండా సరిగ్గా అమర్చుకోవాలి. పాత్రలు ఒరిగితే అందులోని పదార్థాలు కుక్కర్లో పడిపోతాయి. కుక్కర్ నీటితో ఉడకడం వలన కుక్కర్లో నీరు ఇంకిపోయి సేఫ్టీవ
Publish Date: Thu, 23 Aug 2018 (16:45 IST)
Updated Date: Thu, 23 Aug 2018 (17:03 IST)
కుక్కర్లో కొలత ప్రకారం నీటిని పోసుకోవాలి. కంటైనర్స్ ఒరగకుండా సరిగ్గా అమర్చుకోవాలి. పాత్రలు ఒరిగితే అందులోని పదార్థాలు కుక్కర్లో పడిపోతాయి. కుక్కర్ నీటితో ఉడకడం వలన కుక్కర్లో నీరు ఇంకిపోయి సేఫ్టీవాల్వ్ బద్దలవడం, వెయిట్ ఎగిరిపోయి కుక్కర్లో పదార్థాలు పైకి పడడం వంటివి జరుగుతాయి.
గాస్కెట్ పాడయిపోతే కుక్కర్ పక్కల నుండి ఆవిరి బయటకు వచ్చేస్తుంది. అందువలన లోపలి పదార్థాలు ఉడకకపోగా ఎంతసేపటికి విజిల్ రాదు. కుక్కర్లో పెట్టిన గిన్నెలలో ఆహార పదార్థాలను, బియ్యాన్ని పెట్టినప్పుడు ఆ పాత్రలో నీటిని అవి ఉడికేందుకు సరిపడా పోయాలి. చిన్న గిన్నెలలో ఎక్కువ పదార్థాలను పెట్టడం వలన అవి సరిగ్గా ఉడకవు లేదా పొంగి కుక్కర్లో పడిపోతాయి.
కుక్కర్ మూతకున్న రంధ్రం లోపలి నుంచి ఆవిరి బయటకు వస్తున్నప్పుడు వెయిట్‌ని పెట్టాలి. మూతకున్న ఆవిరి రంధ్రం మూసుకుపోకుండా ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. కుక్కర్లో లోంచి ఆవిరి త్వరగా రావడానికి, లోపలి పదార్థాలు ఉడకడానికి హెచ్చు మంటను పెట్టుకోవాలి. వెయిట్ పెట్టిన తరువాత కూడా మంటను తగ్గించకూడదు.
కుక్కర్‌ను దింపిన తరువాత మంటను తగ్గించి ఆ తరువాత స్టౌను ఆర్పాలి. కుక్కర్‌ను దింపిన తరువాత వెంటనే మూత తీయకూడదు. ఒకవేళ తీస్తే దాని వలన గ్యాస్కట్ దెబ్బతింటుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More