వంటింటి గట్టుపై గుడ్డు పగిలి దుర్వాసన వస్తుందా... ఆ ప్రాంతంలో ఉప్పును చల్లుకుంటే?
ఉప్పు లేకుండా ఏ పదార్థం పూర్తికాదు. అన్నీ సరిపోయినా ఉప్పు లేకపోతే రుచే ఉండదు. ఈ ఉప్పు కేవలం వంటలకే కాకుండా మరెన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మరి అవేంటో తెలుసుకుందాం.
Publish Date: Fri, 24 Aug 2018 (15:06 IST)
Updated Date: Fri, 24 Aug 2018 (16:05 IST)
ఉప్పు లేకుండా ఏ పదార్థం పూర్తికాదు. అన్నీ సరిపోయినా ఉప్పు లేకపోతే రుచే ఉండదు. ఈ ఉప్పు కేవలం వంటలకే కాకుండా మరెన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మరి అవేంటో తెలుసుకుందాం.
చెక్కతో చేసిన కుర్చీలు, సోఫాలు కొన్ని పాతవాటిలా ఉంటాయి. గోరువెచ్చని నీటిలో ఉప్పును కలుపుకుని ఆ నీటిలో వస్త్రాన్ని ముంచి కుర్చీలను తుడుచుకోవాలి. కాసేపు ఎండలో ఉంచితే కొత్తగా కనిపిస్తాయి. ఒక్కోసారి బూట్ల నుండి దుర్వాసన వస్తుంది. అటువంటి సమయంలో వాటిపై కొద్దిగా ఉప్పును చల్లితే ఆ వాసన పోతుంది.
ఇత్తడి, రాగి పాత్రలు కొన్ని రోజులకు రంగు మారుతాయి. వీటిని తిరిగి కొత్తవిగా చేయాలంటే కొద్దిగా బియ్యప్పిండిలో వెనిగర్, ఉప్పును కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో రాగి, ఇత్తడి పాత్రలను తోముకుంటే కొత్తవిగా మారుతాయి. ఇంట్లో చీమల బెడద అధికంగా ఉంటే ఆ ప్రాంతంలో కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి. ఇలా చేయడం వలన చీమలు ఆ ప్రాంతాలలో దరిచేరవు.
వంటింటి గట్టుపై గుడ్డు పగిలి దుర్వాసన వస్తే అక్కడ కొద్దిగా ఉప్పు చల్లి కాసేపటి తరువాత శుభ్రం చేస్తే దుర్వాసన సులువుగా వదిలిపోతుంది. ఉప్పునీటిలో ముంచిన వస్త్రంలో కిటికీ అద్దాలను తుడుచుకుంటే కొత్తగా కనిపిస్తాయి. కార్పెట్‌పై మరకలు పోవాలంటే చల్లని నీటిలో ఉప్పును కలుపుకుని ఆ నీటిలో వస్త్రాన్ని ముంచి తుడుచుకుంటే మరకలు తొలగిపోతాయి.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More