Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్

Advertiesment
Glen Maxwell
ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్, విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు 38 ఏళ్ల ఈ స్టార్ క్రికెట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన అతను, మూడు ప్రపంచ కప్‌లను గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతని నిష్క్రమణతో ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక శకం ముగిసినట్లయింది.
 
వాస్తవానికి మ్యాక్స్‌వెల్ 2025 జూన్ 2నే వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు టీ20 ఫార్మాట్ నుంచి కూడా తప్పుకోవడంతో అతని అంతర్జాతీయ కెరీర్ పూర్తిగా ముగిసింది. తన కెరీర్‌లో 149 వన్డేలు, 130 టీ20లు, 7 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఫిబ్రవరి 2026లో ఒమన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచే అతనికి చివరి అంతర్జాతీయ మ్యాచ్. నవంబర్ 21 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయకపోవడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. అంతకుముందే ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్‌కు కూడా అతను రిటైర్మెంట్ ప్రకటించాడు.
 
ఫైనల్ వర్డ్ అనే పాడా కాస్ట్ మాట్లాడుతూ మ్యాక్స్ వెల్ తన నిర్ణయం వెనుక గల కారణాలను వివరించాడు. మందు, ఆ తర్వాత జట్టు యాజమాన్యంతో చాలాసార్లు చర్చలు జరిగాయి. వారి నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని వారు భావిస్తున్నట్లు అర్థమైంది. బంగ్లాదేశ్ సిరీస్‌లో యువకులు అద్భుతంగా రాణించడం మనం చూశాం అని తెలిపాడు.
 
వీడ్కోలు మ్యాచ్ ఆడాలన్న తన కోరిక తీరలేదని మ్యాక్స్‌వెల్ ఆవేదన వ్యక్తం చేశాడు. "నా సొంత మైదానం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఎంసీజీలో ఒక వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని చిన్న ఆశ ఉండేది. కానీ, జట్టు యాజమాన్యం ఆలోచనా విధానాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. 2028 ఒలింపిక్‌ను దృష్టిలో పెట్టుకుని రాబోయే 12-24 నెలల్లో జట్టులో చాలా మార్పులు ఉంటాయి. యువ ఆటగాళ్లను అంతర్జాతీయ ఒత్తిడికి
అలవాటు చేయాలి. ఆ అనుభవం 'బిగ్ బ్యాష్ లీగ్' (బీబీఎల్) మ్యాచ్ ద్వారా ఎల్లప్పుడూ లభించదు" అని వివరించాడు. 
 
ఇంగ్లండ్ సిరీస్‌తు సిద్ధమవ్వాలా? లేక తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలా? అనే సందిగ్ధంలో తన శరీరానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు మ్యాక్స్ వెల్ చెప్పాడు. "మోకాలికి ఇంజెక్షన్ తీసుకుని బీబీఎల్ కోసం సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా శరీరాన్ని తిరిగి దృఢంగా మార్చుకోవడానికి 8 వారాల పాటు పునరావాసంలో ఉంటాను. నా అభిమాన హీరోల లాగా ఘనంగా వీడ్కోలు లభిస్తుందని ఒక్కోసారి మనసు కోరుకుంటుంది. కానీ, వాస్తవాన్ని అంగీకరించి ముందుకు సాగాలి" అని మ్యాక్స్‌వెల్ తన మనసులోని మాటను పంచుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2027: హార్దిక్ పాండ్యా స్థానంలో రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ ఆయనే..