Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్‌కు బెట్టింగ్ బెడద : ఆటగాళ్లను హెచ్చరించిన బీసీసీఐ

Advertiesment
ipl2024

ఠాగూర్

, గురువారం, 17 ఏప్రియల్ 2025 (10:27 IST)
ఐపీఎల్ మ్యాచ్ నిర్వాహకులు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఓ హెచ్చరిక చేసింది. క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లుకు బీసీసీఐలోని యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిట్ ఈ హెచ్చరిక చేసింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారికి బుకీలతో సంబంధాలు ఉన్నాయని, అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ వ్యాపారి చట్ట వ్యతిరేక పనులు చేసేలా వ్యక్తులను ఒత్తిడికి గురిచేస్తున్నాడని పేర్కొంది. 
 
ఐపీఎల్‌లోని వ్యక్తులతో స్నేహం చేసేందుకు, సంబంధాలు పెట్టుకునేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. ఖరీదైన బహుమతులు, నగదు ఇవ్వడం ద్వారా ఇప్పటికే అతడు కొంతమందితో పరిచయం పెంచుకున్నాడని, కాబట్టి ఆ వ్యక్తి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అభిమాని వేషంలో మ్యాచ్‌లోనూ, జట్లు బస చేసే హోటళ్ళలోనూ కనిపిస్తున్నాడని తెలిపింది. బీసీసీఐ ప్రకటనతో ఐపీఎల్‌లో కలకలం రేగింది. ఆ వ్యాపారి ఎవరన్న చర్చ ఇపుడు ఐపీఎల్ నిర్వాహకులతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2025 : సూపర్ ఓవర్‌లో ఢిల్లీ సూపర్ విజయం - సరికొత్త రికార్డు