Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఔను.. మద్యం సేవింంచి వాహనం నడిపాను : డేవిడ్ వార్నర్

Advertiesment
david warner
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత తన తప్పును అంగీకరించారు. గత ఏప్రిల్‌లో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో సిడ్నీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. 
 
తాజాగా ఆ కేసును సిడ్నీ న్యాయస్థానం విచారించింది. నేరాన్ని వార్నర్‌ అంగీకరించినట్లు అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్ కోర్టుకు నేరుగా హాజరు కాలేదు. వాదనలు విన్న న్యాయస్థానం అతడిని దోషిగా తేలుస్తూ వచ్చే నెల 18న శిక్ష ఖరారు చేయనుంది. 
 
కాగా, గతంలో రోడ్డుపై బ్రీత్‌ టెస్టింగ్‌ను చూడగానే వార్నర్‌ తన వాహనాన్ని ఆపి పక్కనే పార్క్‌ చేశాడు. అనుమానం వచ్చిన అధికారులు బ్రీత్‌ అనలైజర్‌తో టెస్ట్‌ చేశారు. ఇందులో వార్నర్‌ పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలడంతో అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ- పెళ్లి పేరిట మోసం.. అత్యాచారం.. దాడి.. క్రికెటర్‌ అభిషేక్‌ను అరెస్ట్ చేయండి