Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హర్మన్ ప్రీత్ కౌర్, జెమియాల అద్భుతమైన క్షణం.. హర్మన్‌ప్రీత్‌ను ఎత్తుకున్న తండ్రి- వీడియో వైరల్

Advertiesment
Harmanpreet Kaur_Jemimah Rodrigues

సెల్వి

, మంగళవారం, 4 నవంబరు 2025 (11:43 IST)
Harmanpreet Kaur_Jemimah Rodrigues
నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ చారిత్రాత్మక ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు భారత మహిళల క్రికెట్ చరిత్రలో గొప్ప క్షణాన్ని లిఖించింది. 
 
ఈ మ్యాచ్‌లో జెమిమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 14 బౌండరీలతో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచి, 339 పరుగుల లక్ష్య ఛేదనలో ఐదు వికెట్లు, తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. 
 
కిక్కిరిసిన స్టేడియం ముందు చిరస్మరణీయ విజయం తర్వాత, భావోద్వేగానికి గురైన జెమిమా కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ఆమె సహచరులు ఆమెను ఓదార్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను పలకరించింది. 
 
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత, జెమిమా తన కుటుంబాన్ని కలవడానికి వెళ్ళింది. అక్కడ ఆమె మరోసారి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మొదట తన తండ్రిని కౌగిలించుకుంది. తరువాత తన కుటుంబంలోని మిగిలిన వారితో భావోద్వేగమైన క్షణాన్ని పంచుకుంది. 
 
ఇదే తరహాలో భారత మహిళా క్రికెట్ జట్టుకు ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టైటిల్ అందించిన తొలి కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్రలో తన పేరును లిఖించుకుంది. సంవత్సరాల తరబడి నిరంతర కృషి తర్వాత తమ తొలి ఐసీసీ టైటిల్‌ను దక్కించుకున్నందుకు అభిమానులు జట్టును ప్రశంసించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.
 
ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్ తన తండ్రి హర్మందర్ సింగ్ భుల్లార్ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఆమె తండ్రి హర్మన్ ప్రీత్ సింగ్‌ను ఎత్తుకున్నారు. హర్మందర్ గర్వంగా తన కూతురిని ఎత్తుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 
ఇకపోతే.. మ్యాచ్ తర్వాత, భారత మహిళా క్రికెట్‌కు పునాది వేసి, దానిని ప్రస్తుత స్థాయికి తీసుకెళ్లడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన ఇద్దరు దిగ్గజాలు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలకు జట్టు ట్రోఫీని అందజేయడం కనిపించింది. తన మాజీ సహచరులతో విజయాన్ని పంచుకోవడం పట్ల హర్మన్‌ప్రీత్ తన భావోద్వేగాలను వ్యక్తం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మృతి మందనాను అభినందించిన కాబోయే భర్త పలాష్ ముచ్చల్ (video)