Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వదేశంలో ఐపీఎల్ : పూర్తి షెడ్యూల్‌ విడుదల

Advertiesment
IPL Latest Season
, ఆదివారం, 7 మార్చి 2021 (15:03 IST)
కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత సీజన్ ఐపీఎల్ పోటీలను యూఏఈ గడ్డపై నిర్వహించిన బీసీసీఐ తాజా సీజన్‌ను స్వదేశంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం పూర్తి షెడ్యూల్ విడదల చేసింది. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఐపీఎల్ 14వ సీజన్ మే 30న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. 
IPL Latest Season
 
చెన్నైలో జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇక, ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా అవతరించిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ మ్యాచ్‌కు వేదికగా నిలవనుంది. ఈ భారీ స్టేడియంలో ఐపీఎల్ పోటీలు జరగడం ఇదే తొలిసారి.
IPL Latest Season
 
కాగా, కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని 6 వేదికల్లోనే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, లీగ్ దశ పోటీలకు ప్రేక్షకులను అనుమతించకుండా, ప్లే ఆఫ్ దశ నుంచి మైదానాలకు ప్రేక్షకులను అనుమతిస్తారని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీసిటీలో గోల్ఫ్ క్రీడా మైదానం ప్రారంభం - అత్యాధునిక సౌకర్యాలతో...