Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ్మూడు పెళ్లికి తొందరపడ్డావంటే.. నీ పని అయిపోయినట్టే...

హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా. అన్నదమ్ములైన వీరిద్దరూ క్రికెటర్లు. ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఒక్కటైన ముంబై ఇండియన్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించారు. హార్దిక్ పాండ్యా అయితే భారత సీనియర్ జట్టులో క

Advertiesment
Krunal Pandya
, గురువారం, 31 మే 2018 (09:17 IST)
హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా. అన్నదమ్ములైన వీరిద్దరూ క్రికెటర్లు. ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఒక్కటైన ముంబై ఇండియన్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించారు. హార్దిక్ పాండ్యా అయితే భారత సీనియర్ జట్టులో కూడా సభ్యుడే. అయితే, ఐపీఎల్ ముగిసిన తర్వాత 'వాట్‌ ద డక్‌ షో' అనే షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రునాల్ పాండ్యా తన సోదరుడు హార్దిక్ పాండ్యాకు ఓ ఉచిత సలహా ఇచ్చాడు. తొందరపడి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవద్దంటూ సూచించాడు.
 
ఈ షోలో భాగంగా హార్దిక్‌ను ఇంటర్వ్యూ చేసిన క్రునాల్‌.. "నా అనుభవంతో చెప్తున్నా సోదరా. ఇప్పుడే పెళ్లి చేసుకోవద్దు. 40 ఏళ్లు వచ్చేదాకా పెళ్లి ప్రసక్తే పెట్టుకోకు. లేదంటే నీ పని అయిపోయినట్టే" అని సరదాగా సూచన చేశాడు. ఇందుకు బదులుగా హార్దిక్‌ స్పందిస్తూ.. "మా అన్న ఎప్పుడూ ఇంతే. ఇలాగే అంటుంటాడు" అని అన్నాడు. కాగా, గతేడాది డిసెంబరులో ప్రేయసి పంఖూరి శర్మను క్రునాల్ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీకి ఐపీఎల్ 2018 కప్ కంటే కూతురే... చూడండి(Video)