Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధర్మశాల టెస్ట్ : కంగారెత్తించిన భారత స్పిన్నర్లు... ఆసీస్ ఆలౌట్... భారత టార్గెట్ 106 రన్స్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను కంగారెత్తించారు. ఫలితంగా ఆసీస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 137 పరుగులకే

Advertiesment
Live cricket score
, సోమవారం, 27 మార్చి 2017 (16:45 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను కంగారెత్తించారు. ఫలితంగా ఆసీస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 137 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత ముంగిట 106 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
బోర్డర్ అండ్ గవాస్కర్ పేటీఎం ట్రోఫీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ టెస్టులో ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేయగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసింది. అంటే మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 32 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆసీస్ జట్టు.. పేసర్ ఉమేష్ యాదవ్ (3), స్పిన్నర్ల ద్వయం జడేజా (3), ఆశ్విన్ (3)ల ధాటికి పేకమేకడలా కుప్పకూలింది. 
 
ఆసీస్ ఓపెనర్లు రెన్ షా (8), వార్నర్ (8) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరగా, స్మిత్ (17), హ్యాండ్స్ కోంబ్ (18) కాసేపు ప్రతిఘటించారు. మ్యాక్స్ వెల్ (45) దూకుడు ప్రదర్శించాడు. షాన్ మార్ష్ (1) వస్తూనే పెవిలియన్ చేరాడు. అనంతరం కుమ్మిన్స్ (12), ఒకీఫ్ (0), లియాన్ (0)ను బౌలర్లు పెవిలియన్‌కు పంపగా, హాజిల్ వుడ్ (0) అండగా మాథ్యూ వేడ్ (25) రెచ్చిపోయాడు. చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. దీంతో  53.5 ఓవర్లకు ఆసీస్ 137 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 
 
టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో మూడేసి వికెట్లు తీసి ఆకట్టుకోగా, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీసి వారికి సహకరించాడు. దీంతో ఆసీస్, భారత్ కు 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. దీంతో విజయానికి మరో 87 రన్స్ కావాల్సింది ఉంది. క్రీజ్‌లో ఓపెనర్లు రాహుల్ 13, విజయ్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంటుంది. చేతిలో పది వికెట్లు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీకి భుజం నొప్పా.. ఉత్తుత్తిదే.. ఐపీఎల్ కోసమే టెస్ట్‌ ఎగ్గొట్టాడు : బ్రాడ్ హాగ్ ఆరోపణ