ఐపీఎల్ 2025 సీజన్ పోటీల్లో భాగంగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా రోజులకు ఓ విజయాన్ని రుచి చూసింది. వరుసగా ఐదు ఓటముల తర్వాత సోమవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. ఆతిథ్య లక్నో జట్టు నిర్ధేశించిన 167 పరుగుల విజయలక్ష్యాన్ని చెన్నై జట్టు 19.3 ఓవర్లలో విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎస్కే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది.
ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించారు. కేవలం 11 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. ఇందులో ఓ సిక్సర్, నాలుగు ఫోర్లు కూడా ఉన్నాయి. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో ధోనీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ క్రమంలో ధోనీ 11 యేళ్ల రికార్డును తిరగరాశాడు.
ఐపీఎల్ చరిత్రలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతిపెద్ద వయస్కుడుగా రికార్డు సృష్టించాడు. సోమవారం మ్యాచ్ నాటికి ధోనీ వయసు 43 సంవత్సరాల 280 రోజులు. ఈ క్రమంలో మాజీ ప్లేయర్ ప్రవీణ్ తాంబే రికార్డును బ్రేక్ చేశాడు. తాంబే గత 2014 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించి, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో 42 యేళ్ళ 208 రోజుల్లో మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.