Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వయసు ఒక అంకె మాత్రమే... సునీల్ గవాస్కర్ రికార్డును బద్ధలు కొట్టి హిట్ మ్యాన్

Advertiesment
Rohit Sharma
Rohit Sharma
వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరోమారు నిరూపించాడు. పర్యాటక వెస్టిండీస్ జట్టుతో బుధవారం గౌహతి వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో శతకంతో చెలరేగిపోయాడు. ఫలితంగా పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చారిత్రక విజయం సాధించింది.
 
వెస్టిండీస్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో భారత్ ఓపెనర్లు దుమ్మురేపారు. కెప్టెన్ గిల్ (133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్స్‌ సాయంతో 223 నాటౌట్) విధ్వంసకర డబుల్ సెంచరీతో కదం తొక్కగా, మరో ఎండ్‌లో రోహిత్ శర్మ కూడా తనదైనశైలిలో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 255 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.
 
ఇది భారత ఓపెనింగ్ జోడీకి వన్డే చరిత్రలో రెండో అత్యధిక భాగస్వామ్యం. 2001లో కెన్యాపై గంగూలీ సచిన్ నెలకొల్పిన 258 పరుగుల భాగస్వామ్యం మాత్రమే దీనికంటే ముందుంది. ఈ మ్యాచ్‌లో కేవలం 75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసిన రోహిత్, తన కెరీర్‌లో 35 వన్డే శతకాన్ని నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్ కేవలం 43.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయం సాధించింది. 
 
ఈ క్రమంలో రోహిత్ శర్మ, భారత గడ్డపై వన్డేల్లో శతకం సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 39 ఏళ్ల 153 రోజుల వయసులో అతను ఈ ఘనత సాధించి, 39 ఏళ్ల క్రితం 1987లో సునీల్ గవాస్కర్ (38 ఏళ్ల 113 రోజులు) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే సిరీస్‌లో తొలి వన్డేలో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి ఈ జాబితాలో రెండో స్థానానికి రాగా, ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయాడు.
 
అంతేగాక వన్డే క్రికెట్లో సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన భారత ఆటగాడిగా తన రికార్డును మెరుగుపరుచుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై శతకం చేసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. పైగా, ఆ రికార్డును ఇపుడు మరింతగా మెరుగుపరుచుకున్నాడు. అలాగే, వెస్టిండీస్‌పై వన్డే శతకం చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా కూడా నిలిచాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ కోహ్లీ నెలకొల్పిన రికార్డును రోహిత్ అధిగమించడం విశేషం. 
 
క్రికెట్ చరిత్రలో 39 ఏళ్ల వయసు దాటిన తర్వాత రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. ఇంతకు ముందు ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం సవత్ జయసూర్య, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వారి సరసన రోహిత్ చేరడం అతని ఫిట్నెస్, ఆట పట్ల నిబద్ధతకు నిదర్శనం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ.. భారత్ వర్సెస్ వెస్టిండీస్, 2వ వన్డే లైవ్ అప్‌డేట్స్ (video)