Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లార్డ్స్‌లో రోహిత్ శర్మ సెంచరీ.. తొలి భారత బ్యాటర్‌గా రికార్డు

Advertiesment
Rohit Sharma
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్‌ రోహిత్‌ శర్మ 84 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ ప్రతిష్ఠాత్మక మైదానంలో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. వన్డే చరిత్రలోనే ఎక్కువ వయసులో (39 సంవత్సరాల 80 రోజులు) సెంచరీ సాధించిన భారత ఆటగాడిగానూ రోహిత్ నిలిచాడు. 
 
ఇంగ్లండ్‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు (8) చేసిన పర్యాటక ప్లేయర్‌గానూ హిట్‌మ్యాన్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ శతకం పూర్తి చేసుకోగానే లార్డ్స్‌ బాల్కనీలో ఉన్న భారత ఆటగాళ్లు, హెడ్ కోచ్ గంభీర్ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. 31 ఓవర్లకు భారత్ స్కోరు 206/1. రోహిత్ (102), కోహ్లీ (23) క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లండ్‌తో చివరి వన్డే మ్యాచ్ : టీమిండియాలో కీలక మార్పు