Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంధుల క్రికెట్‌పై సెహ్వాగ్ ట్వీట్ వివాదాస్పదం.. రెండు కుక్కలు నరకానికి చేరాయ్..

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. సందర్భాన్ని బట్టి ట్విట్టర్లో చలోక్తులు విసరడం సెహ్వాగ్‌కు కొత్తేమీ కాదు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ ఎప్పుడ

Advertiesment
Twitter
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (09:30 IST)
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. సందర్భాన్ని బట్టి ట్విట్టర్లో చలోక్తులు విసరడం సెహ్వాగ్‌కు కొత్తేమీ కాదు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. కానీ మొదటిసారి సెహ్వాగ్ చేసిన ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తమయింది. అది కూడా భారత క్రికెటర్ నుంచే కావడం విశేషం.
 
మొన్నీమధ్య జరిగిన అంధుల టీ-ట్వంటీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని సెహ్వాగ్ ట్విట్టర్ ద్వారా ప్రస్తావిస్తూ.. అంధుల టీ20 ప్రపంచకప్‌ గెలిచిన మరో నీలి రంగు జట్టుకు అభినందనలు. వాళ్లు వంద కోట్లమందికి చిరునవ్వులు పంచారు’’ అని ట్వీట్ చేశాడు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి ఈ ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. 
 
దీనిపై స్పందించిన అజయ్ వీరూ తమను అభినందించడం సంతోషమేనని, కాకపోతే మరో నీలి రంగు జట్టు అని పేర్కొనడమేంటని ప్రశ్నించాడు. తాము కూడా దేశం కోసమే ఆడుతున్నామని, దేశం కోసమే సీరియస్‌గా ఆడతామని అజయ్ తెలిపాడు. 
 
మరోవైపు జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో హిజ్బుల్ ముజాహిదిన్ మిలిటెంట్లతో జరిగిన ఎదురు కాల్పుల్లో మన జవాన్లు రఘుబీర్ సింగ్, బందోరియా గోపాల్ సింగ్ వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై విమర్శలు కురిపిస్తూ, అపహాస్యం పాలు చేస్తూ కాశ్మీర్ యువత ప్రతిస్పందించారు.
 
తాను కాశ్మీర్‌కు చెందిన వాడినని, వాస్తవాధీన రేఖను తొలగించాలని గర్వంగా చెబుతున్నానంటూ మహ్మద్ ఉమర్ అనే వ్యక్తి తన ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా, ‘రెండు కుక్కలు నరకానికి చేరాయి’ అనే ట్వీట్ ను సెహ్వాగ్ ఖాతాకు ట్యాగ్ చేశాడు. ఈ నేపథ్యంలో వీరూ ఘాటుగా స్పందిస్తూ.. ‘మీ లాంటి వాళ్లను వర్ణించేందుకు డిక్షనరీలో పదాలు లేవు. మీరు తొందరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తాను’ అని సెహ్వాగ్ అన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యర్థుల గౌరవం పొందుతున్న అరుదైన జట్టు కోహ్లీ టీమ్